Samsung Galaxy A54 5G Price: సాంసంగ్ Galaxy A54 5G మొబైల్ పై రూ.22,500 వరకు బోనస్..అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా..

Samsung Galaxy A54 5G Price: అతి తక్కువ ధరకే సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి. మంచి సాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో జరుగుతున్న దీపావళి ప్రత్యేక సేల్‌లో అన్ని స్మార్ట్ ఫోన్స్ పై 30% వరకు తగ్గింపు లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 12:44 PM IST
Samsung Galaxy A54 5G Price:  సాంసంగ్ Galaxy A54 5G మొబైల్ పై రూ.22,500 వరకు బోనస్..అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా..

Samsung Galaxy A54 5G Price: దీపావళి సందర్భంగా అన్ని బ్రాండ్లకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ప్రముఖ సాంసంగ్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో Fab Grab Fest సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సెల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో A సిరీస్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం రూ. 30, 000లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక సేల్ లో Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ MRP రూ.45,999తో విక్రయిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ పోను రూ. 37,499కి లభిస్తుంది. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ పాత స్మార్ట్ ఫోన్ చేసి దాదాపు రూ.22500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. దీంతో ఈ Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ. 14,999కే పొందవచ్చు.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

బ్యాంక్ ఆఫర్స్:
స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపు ధరతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Samsung Axis బ్యాంక్ కార్డ్ ను వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 3,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా ఇతర బ్యాంక్ కార్డులపై కూడా తగ్గింపు పొందవచ్చు. 

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
1080x2340 పిక్సెల్ రిజల్యూషన్‌
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
 8 GB RAM + 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
LED ఫ్లాష్‌తో కూడిన 3 కెమెరాలు
50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరాలు
12 మెగాపిక్సెల్ కెమెరాలు
5000mAh బ్యాటరీ
USB టైప్-సి ఇయర్‌జాక్
బ్లూటూత్ 5.3

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News