Samsung Galaxy A53 5G vs Nothing Phone (2a) 5G: ఈ రెండు మొబైల్స్‌ మధ్య ఊహించని తేడాలు.. ఇవి తప్పకుండా తెలుసుకోండి..

Samsung Galaxy A53 5G vs Nothing Phone (2a) 5G: ప్రీమియం ఫీచర్స్‌తో Nothing Phone (2a) 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ సంబంధించిన విక్రయాలు ప్రారంభమవుతే.. Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడబోతోందని మార్కెట్‌లో టాక్‌. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్‌ బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 7, 2024, 02:55 PM IST
Samsung Galaxy A53 5G vs Nothing Phone (2a) 5G: ఈ రెండు మొబైల్స్‌ మధ్య ఊహించని తేడాలు.. ఇవి తప్పకుండా తెలుసుకోండి..

Samsung Galaxy A53 5G vs Nothing Phone (2a) 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ నథింగ్ ఇటీవలే మార్కెట్‌లోకి (2a) 5G మోడల్‌ను విడుదల చేసింది. ఈ నథింగ్ ఫోన్ (2a)5G మొబైల్‌కి సంబంధించిన విక్రయాలు మార్చి రెండవ వారం ప్రారంభం కానున్నాయి. కంపెనీ దీనిని ధర MRP రూ.29,999తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌తో టాక్‌..అయితే ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా అనేక తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సంసంగ్ గెలాక్సీ A53 5G, నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్‌ఫోన్స్‌ మధ్య అనేక తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే, Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీనిని స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే..ఇది Samsung Exynos 1280 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక Nothing Phone (2a) 5G మొబైల్ వివరాల్లోకి వెళ్తే, ఇది 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ అతి శక్తవంతమైన Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో లభించబోతోంది. 

ఇక Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాలు చూస్తే, ఇది ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో 64MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP డెప్త్ సెన్సార్‌ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా ఫ్రంట్‌లో 5MP కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక Nothing Phone (2a) 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో డబుల్‌ కెమెరా సెటప్‌లో లభిస్తోంది. ఇందులో  50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉంటాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP ఫ్రంట్ కెమెరాతో లభిస్తోంది. 

ఇక బ్యాటరీల పరంగా చూస్తే, Samsung Galaxy A53 5G మొబైల్‌ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది అనేక ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇక Nothing Phone (2a) 5G మొబైల్‌ వివరాల్లోకి వెళితే, ఇది 4500mAh బ్యాటరీతో లభించనుంది. అంతేకాకుండా ఇందులో కూడా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో ప్రీమియం లుక్‌ కనిపించేందుకు LED లైట్స్‌ కూడా అందిస్తోంది.  

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఈ రెండు మొబైల్స్‌ ధర వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన సాంసంగ్‌ Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ Nothing Phone (2a) 5G మొబైల్‌ ధర MRP రూ.29,999లో లభిస్తోంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..మంచి డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ పరంగా చూస్తే, Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్‌. ఇక ప్రత్యేకమైన డిజైన్, తక్కువ ధరలో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి Nothing Phone (2a) 5G స్మార్ట్‌ఫోన్‌ గొప్ప ఎంపిగా భావించవచ్చు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News