Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Redmi 13 5G Price: మార్కెట్‌లోకి Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌  లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ జూలై 9వ తేదిన అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 9, 2024, 12:24 PM IST
Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

Redmi 13 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Xiaomi త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ మంగళవారం (9 జూలై) లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్ ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన డిస్ల్పే సెటప్‌తో లాంచ్‌ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైతే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన  Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ 5,030mAh బ్యాటరీతో రానుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌తో రాబోతోంది. ఇక ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ భారత్‌లో ధర రూ.15,000 లోపు అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. 

Redmi 13 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ఆకర్శనీయమైన గ్లాస్‌ కవర్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమిమం మొబైల్‌ను పిలుస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, రింగ్ లైట్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు అద్భుతమైన కలర్‌ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇది  6.67-అంగుళాల డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డిస్ల్పే 90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2400 x 1080 పిక్సెల్స్‌ హై రిజల్యూషన్‌ సెటప్‌తో ఈ డిస్ల్పే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది HDR10+ సపోర్ట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రోటక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది  HyperOS తాజా వెర్షన్‌పై రన్ రానుంది.  ఇక ఈ మొబైల్ బ్యాక్‌ సెటప్‌లో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇదే కాకుండా  2 మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News