Realme C53 - Infinix Smart 8: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు మొబైల్స్‌ ధరలు ఇంత తగ్గుతాయని అనుకున్నారా?

Realme C53 - Infinix Smart 8: అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా సెటప్‌ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే గొప్ప అవకాశం. మొబైల్ బొనాంజా సేల్‌లో భాగంగా Realme C53, Infinix Smart 8 మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 09:52 AM IST
Realme C53 - Infinix Smart 8: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు మొబైల్స్‌ ధరలు ఇంత తగ్గుతాయని అనుకున్నారా?

Realme C53 - Infinix Smart 8: పది వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. మొబైల్ బొనాంజా సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా  108 మెగాపిక్సెల్స్‌ కెమెరా కలిగిన మొబైల్స్‌ 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 జీబీ ర్యామ్ కలిగి స్మార్ట్‌ఫోన్స్‌ రూ.7 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ధరల్లో ఏయే బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లోని మొబైల్ బొనాంజా సేల్‌ ఫిబ్రవరి 15(గురువారం) ముగుస్తుంది. కాబట్టి Poco, Realmeతో పాటు Infinix బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ప్రముఖ చైనీస్‌ టెక్‌ బ్రాండ్‌ Infinix ఇటీవలే లాంచ్‌ చేసిన Smart 8 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ను రూ.7 వేలలోపే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు..

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.710 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.6,400కే పొందవచ్చు. అంతేకాకుండా మరింత చౌకగా పొందడానికి అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఇది 50 మెగాపిక్సెల్స్ కెమెరా, 6.6 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు MediaTek Helio G36 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Realme C53:
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న మొబైల్ బొనాంజా సేల్‌లో భాగంగా Realme C53 స్మార్ట్‌ఫోన్‌ కూడా డెడ్‌ చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. దీంతో పాటు 4 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగిన ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.10 వేలకు పైగా విక్రయించి ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ కేవలం రూ.8 వేల లోపే అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి 5 శాతం వరకు అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News