Realme 13 Pro: భారత మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌కి డిమాండ్ పెరిగిపోతోంది. యువత ఎక్కువగా అతి తక్కువ ధరల్లో లభించే మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Realme 13 Pro పేరుతో అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. దీనిని కంపెనీ Realme 13 Pro, Realme 13 Pro+ సిరీస్‌లలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదిని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ Realme 12 Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను ఈ నెల చివరి వారంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ జూలై 30న జరిపే ఇండియా లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ జరిపే ఈ ఈవెంట్‌ను యూట్యుబ్ ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను కంపెనీ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో తీసుకు రానుంది. ఇక ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ ప్రో వేరియంట్ ధర రూ. 25,000 నుంచి ప్రారంభం కానుంది. దీంతో పాటు ప్రో ప్లస్ వేరియంట్ రూ.35,000 నుంచి మొదలవుతుందని టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
Realme 13 Pro సిరీస్ ఫీచర్లు
ఈ Realme 13 Pro స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గోల్డ్ కలర్ వేరియంట్‌లో విడుదల చేయబోతోంది. దీంతో పాటు మోనెట్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ పూర్తిగా గ్లాస్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను పూర్తిగా ఎమరాల్డ్ గ్రీన్ వెగన్ లెదర్‌తో తీసుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే ఈ సిరీస్‌లో 50MP సోనీ LYT-701 ప్రధాన కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది OIS సపోర్ట్ ఫీచర్‌తో రానుంది. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
50MP ప్రధాన కెమెరా
3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్
50MP సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
HyperImage+ AI సపోర్ట్ ఫీచర్
డిస్ల్పేలో టాప్ పంచ్-హోల్ కటౌట్
హార్డ్‌వేర్ ఫీచర్స్
స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్
Android 14 OS
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి