Difference Between Poco C55 And Redmi 12C: అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ లభిస్తున్నాయి. చాలామంది యువత ఇలాంటి మొబైల్స్‌ని ఎక్కువ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కంపెనీలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన పోకో సి55, రెడ్మీ 12c మొబైల్స్ కి గొప్ప గుర్తింపు లభించింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన అమ్మకాలు ఊపందుకున్నాయి. అలాగే ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కూడా ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ రెండు మొబైల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లను అందించడం వల్ల వీటికి మరింత ప్రజాదరణ లభించింది. అయితే ఫీచర్ల పరంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు మధ్య అనేక తేడాలు ఉన్నాయి. చాలామంది ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకొనేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర పరంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ మొబైల్ మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.
పోకో సి55, రెడ్మీ 12c స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ కు సంబంధించిన తేడాల వివరాల్లోకి వెళితే..పోకో సి55 స్మార్ట్ ఫోన్ 6.58-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్ MediaTek Helio G85 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన స్టోరేజ్ విషయానికొస్తే.. ప్రస్తుతం పోకో సి55 మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో మొదటిది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే.. రెండవది 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లో అందుబాటులో ఉంది.
ఇక రెడ్మీ 12c మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, పోకో కంటే కొంత పెద్ద డిస్ప్లే తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్ 6.71-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే తో 50Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో లభిస్తోంది. ఈ మొబైల్ Unisoc T616 ప్రాసెసర్ పై పని చేస్తుంది. అలాగే స్టోరేజ్ వివరాల్లోకి వెళితే..రెడ్మీ 12c మొబైల్ 3GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ స్టోరేజ్ ల పరంగా చూస్తే.. పోకో మొబైల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కెమెరాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..పోకో సి55 స్మార్ట్ ఫోన్ బ్యాక్ సెట్అప్లో డబుల్ కెమెరా సెట్‌తో 50MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో లభిస్తోంది. ఇక రెడ్మీ 12c స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇది కూడా బ్యాక్‌లో డబుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో కెమెరా ఉంటాయి.
అలాగే రెడ్మీ 12c స్మార్ట్ ఫోన్5000mAh బ్యాటరీతో 10W ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన డిజైన్స్ విషయానికొస్తే..పోకో సి55 మొబైల్ వెనుక భాగంపై టెక్చర్డ్ ఫినిష్, వాటర్‌డ్రాప్ నాచ్ తో లభిస్తోంది. రెడ్మీ 12c స్మార్ట్ ఫోన్ మాత్రం సాధారణ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధరను చూస్తే..పోకో సి55 స్మార్ట్ ఫోన్ రూ.9,499 (4GB + 64GB), రూ.10,999 (6GB + 128GB)తో లభిస్తోంది. రెడ్మీ 12c మొబైల్ రూ.8,499 (3GB + 64GB), రూ.9,499 (4GB + 128GB)తో అందుబాటులో ఉంది.
ఇందులో ఏ మొబైల్ బెస్ట్ అంటే?
పెద్ద డిస్ప్లేతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్ వాలనుకునేవారు రెడ్మీ 12c స్మార్ట్ ఫోన్ మంచి ఎంపికగా భావించవచ్చు. ఇక మంచి డిజైన్ డిజైన్, ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కావాలంటే, పోకో సి55 స్మార్ట్ ఫోన్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి