Oppo F25 Pro Launch Date: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 29న లాంచ్, ఎలా ఉంటుందంటే

Oppo F25 Pro Launch Date: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Oppo F25 Pro 5G ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందో అధికారికంగా ఒప్పో వెల్లడించింది. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇతర వివరాలను అమెజాన్ విడుదల చేసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2024, 05:30 PM IST
Oppo F25 Pro Launch Date: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 29న లాంచ్, ఎలా ఉంటుందంటే

Oppo F25 Pro Launch Date: ఒప్పోలో ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Oppo F25 Pro 5G లాంచ్ తేదీని ఒప్పో అధికారికంగా ప్రకటించేసింది. ఫిబ్రవరి లీప్ ఇయర్ చివరి రోజున లాంచ్ చేయనుంది. Oppo F25 Pro 5G డిజైన్, కలర్ ఆఫ్షన్లను ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్  రివీల్ చేసింది. 

ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జి హోల్ ఇన్ వన్ డిస్‌ప్లేతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఫోన్ వెనుకవైపు భాగంలో 3 కెమేరాసెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మెరూన్, లైట్ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఒప్పో ఇంకా వెల్లడించలేదు. కానీ ఒప్పో రెనో 11 ఎఫ్ 5జి స్మార్ట్‌ఫోన్‌కు కొద్దిగా మార్పులు చేసి ఉంటుందని తెలుస్తోంది. ఒప్పో రెనో 11 ఎఫ్ 5జి స్మార్ట్‌ఫోన్ అయితే 6.7 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్రేక్ కాకుండా ఉండేందుకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా డైమెన్సిటీ 7050 చిప్‌సెట్  కలిగి ఉంటుంది. 

ఇక ఒప్పో రెనో 11 ఎఫ్ 5జి స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం మరో ప్రత్యేకత. అంతేకాకుండా 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ లేదా వీడియో కాల్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటే..64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఉంటాయి. త్వరలో లాంచ్ కానున్న ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్‌లో కూడా దాదాపు ఇవే ఫీచర్లు ఉండవచ్చు. కెమేరాపరంగా కొద్దిగా మెగాపిక్సెల్ ఎక్కువ ఉండవచ్చని అంచనా. 

Also read: Best Mileage Bike Under 80k: 80 వేల లోపే 100 కీలో మీటర్ల మైలేజ్ ఇచ్చే టాప్‌ బైక్స్‌ ఇవే.. పూర్తి వివరాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News