OnePlus 12 Series: కళ్లు చెదిరే డిజైన్, అద్భుతమైన కెమేరా ఆకర్షించే ఇతర ఫీచర్లతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. వన్‌ప్లస్‌లో ఇప్పుడు 12 సిరీస్ లేటెస్ట్. వన్‌ప్లస్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మొత్తానికి ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చేశాయి. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12 ఆర్ రెండు రకాల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటి ధరలు, ప్రత్యేకతలు పరిశీలిద్దాం.
OnePlus 12 ప్రత్యేకతలు
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 6.82 ఇంచెస్ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. రిజల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఎల్టీపీవో టెక్నాలజీ కావడంతో రిఫ్రెష్ రేట్ 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకూ దానికదే సెట్ చేసుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4500 బ్రైట్‌నెస్ ఉంటుంది. దీనికి ముందు భాగంలో కార్మింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటే వెనుకవైపు కార్నింగ్ గ్లాస్ 5 ఉంటుంది. OnePlus 12 మూడు కెమేరాలు కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉండటం వల్ల ఫోటోలు చాలా సహజంగా, అందంగా వస్తాయి. అంతేకాకుండా ప్రొఫెషనల్ కెమేరాల స్థాయిలో ఫోటో షూట్ చేసేందుకు వీలుంటుంది. ఎందుకంటే 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ టెలిఫోటో సెన్సార్, 6 ఎక్స్ ఇన్‌సెన్సార్ జూమ్, 120 ఎక్స్ డిజిటల్ జూమ్ ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 3 చిప్‌సెట్ ఉంటుంది. గేమింగ్ కోసం అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇక బ్యాటరీ అయితే 5400 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 80 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్, 50 వాట్స్ ఎయిర్ వోక్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 100 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 26 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది,.
వన్‌ప్లస్ 12 ధర
వన్ ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 64,999 రూపాయలు కాగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర 69,999 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్ బుకింగ్ జనవరి 23 అంటే నిన్నట్నించి ప్రారంభమైంది. జనవరి 30 నుంచి విక్రయాలుంటాయి. కొన్ని బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 2000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
OnePlus 12R ప్రత్యేకతలు
OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ 1.5కే ఎమోల్డ్ ప్రో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల కళ్లు చెదిరే రిజల్యూషన్, స్క్రీన్ క్లారిటీ ఉంటుంది. ఎల్‌టీపీవో 4వ జనరేషన్ టెక్నాలజీ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇది కూడా ఆండ్రాయిడ్ 14 ఆదారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ డబుల్ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇక కెమేరా పరిశీలిస్తే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 89 మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమేరా కలిగి ఉండటం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇది కూడా రెండు వేరియంట్లలో లభ్యమౌతోంది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ధర 39,999 రూపాయులు కాగా, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 45,999 రూపాయలుగా ఉంది.
ఇంత అద్భుతమైన కెమేరా ఇతర ఫీచర్లతో వన్‌ప్లస్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి మరి.
Also read: Jio Prepaid plans: 84 రోజుల వ్యాలిడిటీతో అత్యధిక డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook