NOISE New Smart Watch: నాయిస్ నుంచి మరో స్మార్ట్‌వాచ్, ఇవాళే లాంచ్, ఫీచర్లు, ధర ఇలా

NOISE New Smart Watch: మార్కెట్‌లో ఇప్పుడు అంతా స్మార్ట్‌వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లు దింపుతున్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లలో నాయిస్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2024, 10:13 AM IST
NOISE New Smart Watch: నాయిస్ నుంచి మరో  స్మార్ట్‌వాచ్, ఇవాళే లాంచ్, ఫీచర్లు, ధర ఇలా

NOISE New Smart Watch: స్మార్ట్‌వాచ్‌లలో Noise కంపెనీ వాచ్‌లకు క్రేజ్ ఎక్కుే. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో, అందుబాటు ధరల్లో స్మార్ట్ వాచ్‌లు లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు Noise Colorfit Ore పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఈ వాచ్ ప్రత్యేకతలు, ధర ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Noise Colorfit Ore 2.1 ఇంచెస్ డైనమిక్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అల్ట్రా ధిన్ బెజెల్స్‌తో డిజైన్ చేయడంతో అద్బుతమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో 100 ప్లస్ క్లౌడ్ ఆధారత సేవలు లభిస్తాయి. 600 నిట్స్ బ్రైట్‌నెస్ కావడంతో కచ్చితంగా రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. మెటాలిక్ డయల్ వాచ్ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఇక కనెక్టివిటీ గురించి పరిశీలిస్తే బ్లూటూత్ 5.3 వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు అంతరాయం ఉండదు. మెటాలిక్ కేసింగ్ ఉండి, లెదర్, సిలికాన్, మెటల్ బ్యాండ్స్ కలిగి ఉంటుంది. 

ఇన్నర్ బిల్ట్ మైక్రో స్కోప్ ఉండటంతో ట్రూ సింక్ సహాయంతో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ పరిధి కూడా 18 మీటర్లు ఉంటుంది. బ్లూటూత్ కాల్స్‌పై వినియోగిస్తే మాత్రం బ్యాటరీ బ్యాకప్ రెండ్రోజులే వస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ ఓరే స్మార్ట్ వాచ్‌ను నాయిస్ ఫిట్ యాప్‌తో అనుసంధానం చేస్తే మీ స్లీపింగ్ సైకిల్ వివరాలన్నీ నమోదవుతాయి. ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూడవచ్చు. అంతేకాకుండా హార్ట్ బీట్, పల్స్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్, స్లీపింగ్ మానిటరింగ్, స్ట్రెస్, విమెన్ సైకిల్ ట్రాకర్ వంటివి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

Also read: VIVO V30 Lite: అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంటున్న VIVO V30 Lite, కళ్లు చెదిరే డిస్ ప్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News