Motorola Edge 50 Pro: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో మోటోరోలా కొత్త ఫోన్, లాంచ్ తేదీ ఇతర ఫీచర్లు ఇలా

Motorola Edge 50 Pro: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్ బ్రాండ్లలో మోటోరోలా ఒకటి. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 04:30 PM IST
Motorola Edge 50 Pro: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో మోటోరోలా కొత్త ఫోన్, లాంచ్ తేదీ ఇతర ఫీచర్లు ఇలా

Motorola Edge 50 Pro: దేశంలో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి మోటోరోలా. మోటోరోలా ఇండియా త్వరలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, కెమేరా వివరాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా బహిర్గతమయ్యాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ ఫోన్ ఇది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో. ఏప్రిల్ 3న ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫాంటోన్ సర్టిఫైడ్ 6.7 ఇంచెస్ కర్వ్ పోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఏకంగా 2000 నిట్స్ బ్రైట్‌‌నెస్ ఉండటంతో ఫోన్ క్లారిటీ అద్భుతంగా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్‌జిఎస్ టెక్నాలజీ కావడంతో బ్లూ లైట్ నియంత్రించి కంటికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసి ప్రోసెసర్ సహాయంతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 68 వాట్స్ ఛార్జర్, 125 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధీమింగ్‌తో ఫోన్ స్టైల్ సింక్ చేయవచ్చు. ఇక కెమేరా పరంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 10 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరాతో 3 కెమేరా సెటప్ ఉంటుంది. ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ ట్రాకింగ్, ఏఐ ఫోటో మాస్టరింగ్, టిల్ట్ మోడ్ వంటి ఫీచర్లు కెమేరాలో ఉన్నాయి. అంతేకాకుండా సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం కూడా ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమేరా ఇస్తోంది కంపెనీ. దాంతో వీడియో కాలింగ్ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇక సెల్ఫీలు చాలా అద్భుతంగా వస్తాయి.

ఇక ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ కలిగి ఉండటం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది. బ్యాటరీ 4500 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లాంచ్ ఏప్రిల్ 3న ఢిల్లీలో ఉంటుంది. అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

Also read: AI Chatboat in IRCTC: ఇక నుంచి ఏఐ చాట్‌తో రైల్వే టికెట్ల బుకింగ్, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News