Motorola Edge 50 Fusion Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మోటరోలా (Motorola) తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో రూ.20 వేల లోపే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది Motorola Edge 50 Fusion పేరుతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ గతం వారంలో లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన సేల్ ఈ రోజు 5 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. దీనిని కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గం ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు, మొదటి సేల్‌లో లభించే డిస్కౌంట్ ఆఫర్స్, దీనిని ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటరోలా కంపెనీ ఈ Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులోని బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.22,999కే అందుబాటులోకి రానుంది. ఇక ప్రీమియం వేరియంట్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 24,999కే అందించబోతున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ మోక్రో సైట్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన విక్రయాలు శుక్రవారం 5 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఈ మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను ధర రూ.20,999కే పొందవచ్చు. అలాగే ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా దాదాపు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ మొబైల్‌పై నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్:
6.7-అంగుళాల OLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లే
2.4GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్
Adreno 710 GPU
డబుల్ కెమెరా సెటప్
సోనీ LYT-700C సెన్సార్ ఫీచర్
50MP OIS ప్రధాన కెమెరా
13MP అల్ట్రా-వైడ్ కెమెరా
32MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి