Infinix Zero 30 5G: సగం ధరకే 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా Infinix Zero 5G మొబైల్..డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే..

Drop Infinix Zero 30 5G Price: అత్యంత చౌకగా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంద. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 03:34 PM IST
Infinix Zero 30 5G: సగం ధరకే 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా Infinix Zero 5G మొబైల్..డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే..

Drop Infinix Zero 30 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని స్మార్ట్ ఫోన్స్ బంపర్ తగ్గింపుతో లభిస్తున్నాయి. అయితే మొబైల్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ను డిసెంబర్ 21 వరకు పొడిగించింది. ఇదే సేల్‌లో భాగంగా ఇప్పుడు సూపర్ వాల్యూ డేస్ డీల్స్ కూడా మొదలయ్యాయి. ఈ డీల్స్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫినిక్స్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Infinix Zero 5G స్మార్ట్ ఫోన్‌ను అతి చౌకగా అందిస్తోంది. మీరు కూడా తక్కువ ధరతోనే శక్తివంతమైన కెమెరాతో కూడిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌ ఈ ప్రత్యేక డీల్‌లో Infinix Zero 5G స్మార్ట్ ఫోన్‌ను 20% తగ్గింపుతో అందిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ MRP రూ. 29,999లతో విక్రయిస్తోంది. అయితే ఈ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 20% తగ్గింపుతో కేవలం రూ. 23,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏదైనా బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

ఎక్స్చేంజ్ ఆఫర్:
ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై మరింత అదనపు తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ వినియోగించి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పై ధరను రూ. 17,950 తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ బోనస్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. పాత మొబైల్ కండిషన్ బాగుంటే పై బోనస్ను పొందొచ్చు..లేదంటే డిస్కౌంట్‌లో తగ్గింపులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
Infinix Zero 30 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
6.7 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
డిస్‌ప్లే ప్రోటక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 5
256 GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌
డైమెన్షన్ 8200 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌
LED ఫ్లాష్‌
ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా  
108 మెగాపిక్సెల్ కెమెరా 
 AI లెన్స్
50 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్‌ కెమెరా
5000mAh బ్యాటరీ 
68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 13 ఆధారంగా XOS 13
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News