Find My Phone: మీ ఫోన్ చోరీకి గురైతే ముందు ఇలా చేయండి.. తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయండి

How To Get Lost Mobile Phone: మీ మొబైల్ ఫోన్ పోతే ముందుగా నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేస్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు సాధ్యమైనంత త్వరగా మీ సిమ్‌ను బ్లాక్ చేయించండి. లేకపోతే మీ ఫోన్‌ నుంచి దుండగులు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేసే ప్రమాదం ఉంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 09:56 PM IST
Find My Phone: మీ ఫోన్ చోరీకి గురైతే ముందు ఇలా చేయండి.. తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయండి

How To Get Lost Mobile Phone: ప్రస్తుతం మొబైల్ వినియోగం భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే అదేస్థాయిలో ఫోన్ల చోరీలు కూడా జరుగుతున్నాయి. నడుస్తున్న సమయంలో.. ప్రయాణ సమయాల్లో.. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో.. రాత్రి వేళ పడుకున్న సమయంలో.. ఇలా అనేక మంది తమ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. మీ ఫోన్ కాకపోయినా.. మీకు తెలిసిన వాళ్లు ఫోన్ పోయే ఉంటుంది. అప్పుడు వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి..? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని ఎక్కువ మంది చెబుతారు. నిజమే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన పనిచేయాల్సి ఉంటుంది. 

మీ ఫోన్ గానీ.. తెలిసిన వాళ్ల ఫోన్ చోరికి గురైతే.. వెంటనే మీ టెలికామ్ ఆపరేటర్‌కు కాల్ చేసి సిమ్ బ్లాక్ చేయించండి. లేకపోతే మీ మొబైల్‌లో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు అన్ని ఉంటాయి. మీ మొబైల్‌తోపాటు మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ సిమ్‌ను బ్లాక్ చేసుకోండి. తరువాత మీ మొబైల్ ఈఎంఈఐ నంబరుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి.

మీ పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మీ ఫోన్ చోరీ గురైందా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నారా..? అనేది నిర్ణయించుకోండి. మీరు పోగొట్టుకున్న ఫోన్‌పై మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేస్తారు. అదే దొంగతనానికి గురైతే ఎఫ్‌ఐఆర్ రాస్తారు. పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు.. ముందుగా ఏం జరిగిందో స్పష్టంగా వివరించండి. 

మీ ఫోన్‌ను ఎవరైనా ఎత్తుకువెళితే.. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించండి. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించవచ్చు. తరువాత తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదు నంబర్ కాపీని తీసుకోవాలి. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వెబ్‌సైట్ https://www.ceir.gov.in/Home/index.jspలో చెక్ చేసుకోండి. ఫోన్ మోడల్, సిమ్, ఈఎంఈఐ నంబర్ వంటి దేశంలోని ప్రతి ఫోన్ డేటాను సీఈఐఆర్ కలిగి ఉంటుంది.

చోరీకి గురైన ఫోన్‌ను ఇక్కడి నుంచి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. https://www.ceir.gov.in/Home/index.jspని సందర్శించిన తర్వాత మీరు బ్లాక్ లేదా లాస్ట్ మొబైల్, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అన్-బ్లాక్ ఫౌండ్ మొబైల్ అనే ఆప్షన్లపై క్లిక్ చేయండి. దొంగతనానికి ఫోన్‌ను బ్లాక్ చేయడానికి ఇక్కడ మీరు స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ వివరాలను నమోదు చేసి చెక్ చేసుకోండి.

Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన  

Also Read: Arshin Kulkarni: చితక్కొట్టాడు.. సిక్సర్ల వర్షం కురిపించిన అర్షిన్ కులర్ణి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News