Honor Play 50 Plus Price: 6,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి Honor Play 50 Plus మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Honor Play 50 Plus Price: చైనా టెక్‌ కంపెనీ హానర్ మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసింది. Honor Play 50 Plus పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ విడుదలైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 01:01 PM IST
 Honor Play 50 Plus Price: 6,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి Honor Play 50 Plus మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

 

Honor Play 50 Plus Price: ప్రముఖ చైనా టెక్‌ కంపెనీ హానర్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్‌ను కంపెనీ  హానర్ ప్లే 50 ప్లస్ పేరుతో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో పాటు ప్రీమియం లుక్‌లో కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ Honor Play 50 Plus 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో విడుదలైంది. ఇది 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగి ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే..చైనాలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్ ఉండగా భారత్‌లో సుమారు రూ. 16,229 ఉండొచ్చని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండవ వేరియంట్‌  12GB RAM + 256GBకు సంబంధించిన పూర్తి వివరాలు, ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఈ మొబైల్‌ ఫోన్‌ మ్యాజిక్ నైట్ బ్లాక్, స్టార్ పర్పుల్, యుకింగ్,  స్ట్రీమింగ్ సిల్వర్ రంగులలో లభిస్తోంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

హానర్ ప్లే 50 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Honor Play 50 Plus 6.8 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పూర్తి HD+ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్‌లు, రిఫ్రెష్ రేట్ 90Hzను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ ఓఎస్ 7.2పై రన్‌ అవుతుంది. హానర్ ప్లే 50 ప్లస్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా  6,000mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యింది. 

Honor Play 50 Plus ఇతర ఫీచర్స్‌:
డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌
6,000mAh బ్యాటరీ
35W  ఛార్జింగ్‌ సపోర్ట్‌
12GB RAM, 256GB ఇంబిల్ట్ స్టోరేజ్
50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
2 మెగాపిక్సెల్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
డ్యూయల్ స్పీకర్లు
హై-రెస్ ఆడియో సపోర్ట్
3.5 మిమీ ఆడియో జాక్
డ్యూయల్ సిమ్
బ్లూటూత్ 5.1
USB-C పోర్ట్ 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News