Google Pixel 8A Expected Release Date: ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి మొబైల్స్‌ను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రీమియం బ్రాండ్స్‌కి సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలకే శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్నాయి. మార్కెట్‌లో యాపిల్, గూగుల్, వన్‌ప్లస్ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్‌కి ఎక్కువగా డిమాండ్ ఉంది. అయితే కంపెనీలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేస్తున్నాయి. వరసగా ఇటీవలే యాపిల్ కంపెనీ కూడా కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవలే కొన్ని వార్త సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం..Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి వేరియంట్ 128GB స్టోరేజ్ అయితే, రెండవది 256GB స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, దాదాపు 499 యూరోలు ఉండే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే భారత్‌లో దీని ధర రూ.45 వేలకు పైనే ఉండే ఛాన్స్ ఉంది. ఇక 256GB వేరియంట్ ధర విషయానికొస్తే దాదాపు 630 యూరోలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో దీని ధర సుమారు రూ. 57 వేలు ఉంటుందని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది. కంపెనీ దీనిని అబ్సిడియన్ (బ్లాక్), వైట్, బే, మింట్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మార్కెట్‌లోకి లాంచ్ అయితే ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన టెన్సర్ G3 చిప్ సెటప్‌పై పని చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 6.1 అంగుళాల OLED ప్యానెల్‌తో రాబోతోందని టిప్‌స్టర్స్ తెలిపారు.
Google Pixel 8a స్పెసిఫికేషన్‌లు:
డిస్ప్లే: 6.1 అంగుళాల FHD+ OLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Google Tensor G3 చిప్‌సెట్
ర్యామ్: 8GB
స్టోరేజ్: 128GB
రియర్ కెమెరా: 12.2MP ప్రధాన సెన్సార్ + అల్ట్రా వైడ్ సెన్సార్
ఫ్రాంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 4400mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter