Flipkart Smart tv Offers: 18వేల బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ఇప్పుడు కేవలం 3 వేలకే..ఎలాగంటే

Flipkart Smart tv Offers: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ముగిసినా ఇంకా కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఆ స్మార్ట్‌టీవీ కేవలం 3 వేలకే లభ్యం కానుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2022, 08:11 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా కొనసాగుతున్న డిస్కౌంట్ ఆఫర్లు
  • రియల్ మి 32 ఇంచెస్ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ కేవలం 3 వేలకే
  • పరిమితమైన ఆఫర్, ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రమే
Flipkart Smart tv Offers: 18వేల బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ఇప్పుడు కేవలం 3 వేలకే..ఎలాగంటే

నిన్న మొన్నటివరకూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు హల్‌చల్ చేశాయి. ఇప్పుడు ప్రత్యేక సేల్ ఆఫర్లు ముగిసినా ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో దీవాళి డిస్కౌంట్ సేల్ ముగిసిపోయినా..ఇంకా కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 32 ఇంచెస్ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ కేవలం 3 వేలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. అద్బుత ఫీచర్లు కలిగిన 18 వేల ఈ స్మార్ట్‌టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 3వేలకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. సాధారణంగా ఎల్ఈడీ స్మార్ట్‌టీవీలపై కస్టమర్లు 20 వేల నుంచి 25 వేల వరకూ ఖర్చు పెడుతుంటారు. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు 4 వేల కంటే తక్కువ ధరకే లభించే పరిస్థితి. ఈ డీల్ గురించి ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది రియల్‌మి 32 ఇంచెస్ హెచ్‌డి రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఈ స్మార్ట్‌టీవీ లిస్టింగ్ ధర 13,999 రూపాయలు. ఇతర స్మార్ట్‌టీవీ లిస్టింగ్ ధరలతో పోలిస్తే ఇది తక్కువే. ఇప్పుడీ స్మార్ట్‌టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌టీవీ ఎక్స్చేంజ్‌లో ఇస్తే ఏకంగా 11 వేలు తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే ఈ స్మార్ట్‌టీవీ మీకు కేవలం 3 వేల రూపాయలకే లభించనుంది. 

ఈ స్మార్ట్‌టీవీలో ప్రీ ఇన్‌స్టాల్డ్ క్రోమ్, ఓటీటీ యాప్స్, యూట్యూబ్ ఉన్నాయి. బ్రాండ్ పరంగా కూడా రియల్‌మి పేరున్న కంపెనీ. ఇందులో 30 వాట్స్ సౌండ్ సిస్టమ్ మరో ప్రత్యేకత. ఇప్పటికే దీవాళి ఆఫర్ ముగిసినా కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఇంకా డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంది. మీరు స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ చాలారోజులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే దీపావళి మెగా డిస్కౌంట్ సేల్ కూడా ముగిసింది. ఇప్పుడు కేవలం పరిమిత ఉత్పత్తులపై డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. కొన్నిరోజులకు ఇప్పుడిచ్చే డిస్కౌంట్ ఆఫర్ కూడా లేకపోవచ్చు.

Also read: Bullish Stock: అక్టోబర్ నెలలో భారీగా వృద్ధి నమోదు చేసిన మూడు బ్యాంకు షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News