Flipkart Mobile Offers: రియల్‌మి నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, రోజుకు 12 రూపాయలు చెల్లిస్తే చాలు

Flipkart Mobile Offers: ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ మీ కోసం అతి తక్కువ ధరకే లభించనుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్స్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 27, 2023, 09:54 PM IST
Flipkart Mobile Offers: రియల్‌మి నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, రోజుకు 12 రూపాయలు చెల్లిస్తే చాలు

Flipkart Mobile Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై అద్బుతమైన కళ్లు చెదిరే డిస్కొంట్ ఆఫర్లు ఉన్నాయి. అంతకుమించి నమ్మశక్యం కాని సులభమైన ఈఎంఐ చెల్లింపులున్నాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మీరు పొందవచ్చు.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. రియల్‌మి ఇప్పుడు తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. రియల్‌మి సి53 పేరుతో అద్భుతమైన ఫీచర్లతో భారతదేశ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కేవలం 9,999 రూపాయలు మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. రియల్‌మి సి53లో 6.74 అంగుళాల డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ కాగలదు. దీనికితోడు ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ వరకూ సపోర్ట్ చేసే రోమ్ సామర్ధ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. రియల్‌మి సి53 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు కాగా ఇందులోనే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 10,999 రూపాయలుంటుంది. 

రియల్‌మి సి 53లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మెమరీ కార్డు సహాయంతో 2 టీబీ వరకూ పెచుకోవచ్చు. రియల్‌మిలో డ్యూయల్ కెమేరా సేటప్ ఉంది. ప్రైమరీ కెమేరా 108 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ కెమేరా సెన్సార్ వైపు రెండు కెమేరాలున్నాయి. సెల్ఫీ కోసం ఫ్రంట్ సైడ్ 6 మెగాపిక్సెల్ ఉంది. రియల్‌మి సి 53లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్స్ ఛార్జర్ చేస్తుంది. ఇది కాకుండా మైక్రో ఎస్‌డి కార్డు సపోర్ట్ చేస్తుంది. యూఎస్‌బి టైప్ సి బ్రౌజర్ సపోర్ట్, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. 

రియల్‌మి సి 53 ఫోన్ ధర 9,999 రూపాయలు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు సులభమైన ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. నెలకు కేవలం 353 రూపాయలు అంటే రోజుకు కేవలం 12 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. 

Also read: Good News for SBI Customers: ఎస్‌బీఐ యూజర్స్‌కి గుడ్ న్యూస్‌.. ఇకపై వాట్సప్‌ లో 15 సేవలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News