Apple iPad @ Rs 13,000: యాపిల్ ఐప్యాడ్‌పై ఊహించని డిస్కౌంట్.. సగం కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోండి

Apple iPad Offer in Flipkart: యాపిల్ కంపెనీ ఉత్పత్తులంటే అందరికీ క్రేజ్. యాపిల్ ఫోన్ కావచ్చు, ఐపాడ్ కావచ్చు, స్మార్ట్‌వాచ్ కావచ్చు. కానీ ధర అధికంగా ఉండటంతో అందరూ వెనుకంజ వేస్తుంటారు. కానీ ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ చూస్తే మాత్రం ఇక వెనుదిరిగి చూడరు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 10:47 AM IST
Apple iPad @ Rs 13,000: యాపిల్ ఐప్యాడ్‌పై ఊహించని డిస్కౌంట్.. సగం కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోండి

Get Apple iPad 9th Generation @ Rs 13,000: యాపిల్ ఐప్యాడ్ అంటే విద్యార్ధులకు, ఉద్యోగస్థులకు అందరికీ చాలా ఇష్టం. యాపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్ మోడల్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే అందుతోంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ చూస్తే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకుంటారు.

యాపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్ సినిమాలకు, గేమింగ్ కోసం, చదువుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది. 64 జీబీ ర్యామ్ కలిగి ఉన్న ఈ ఐప్యాడ్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇదొక ప్రీమియం ట్యాబ్లెట్. ఈ ఐప్యాడ్ కొనుగోలుకు దీర్ఘకాలంగా చూస్తుంటే..ఇదే మంచి అవకాశం. సగానికి పైగా డిస్కౌంట్ లభిస్తుండటం చాలా విశేషమనే చెప్పాలి. 

ఆఫర్ ఏంటి..?

యాపిల్ ఐప్యాడ్ 9వ జనరేషన్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. ఈ ఆఫర్‌తో కస్టమర్లకు చాలా లాభం కలుగుతుంది. ఈ ఐప్యాడ్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌పై 33,900 రూపాయలుంది. దీనిపై 8 శాతం డిస్కౌంట్ తీసివేస్తే 30,900 రూపాయలకు లభిస్తోంది. దీనిపై మరో ఆఫర్ కూడా ఉంది. అది ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే ఐప్యాడ్ 30,900 రూపాయల కంటే తక్కువకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కింద 17,500 రూపాయలు లభిస్తాయి. అయితే పూర్తి ఆఫర్ అనేది ఎక్స్చేంజ్ చేసే మోడల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఏకంగా 17,500 రూపాయలు తగ్గిపోతాయి. అంటే ఈ ఐప్యాడ్ మీకు కేవలం సగం ధరకే లభిస్తుంది.

Also Read: Best 7 Seater Cars: జస్ట్ రూ. 6.33 లక్షలకే 7 సీటర్ కారు.. మారుతితో పోలిస్తే 5 లక్షల తేడా

Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News