Flipkart Geyser Offers: భారీ డిస్కౌంట్, ఇన్‌స్టంట్ గీజర్ ధరకే 25 లీటర్ల స్టోరేజ్ గీజర్ సొంతం చేసుకోండి

Flipkart Geyser Offers: వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం చల్లగా మారింది. వర్షాకాలం తరువాత శీతాకాలం. దాంతో ఇక గీజర్ వాడకం తప్పనిసరి అవుతుంటుంది. అదే సమయంలో ఆన్‌లైన్ ఈ కామర్స్ వేదికల్లో గీజర్లపై భారీ ఆఫర్లు అందుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2023, 12:36 AM IST
Flipkart Geyser Offers: భారీ డిస్కౌంట్, ఇన్‌స్టంట్ గీజర్ ధరకే 25 లీటర్ల స్టోరేజ్ గీజర్ సొంతం చేసుకోండి

Flipkart Geyser Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై ఊహించని ఆఫర్లు అందుూబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఇప్పుుడీ సమయంలో అందరికీ కావల్సింది గీజర్. గీజర్లపై అద్బుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం..

సాధారణంగా గీజర్లు రెండు రకాలుంటాయి. ఒకటి ఇన్‌స్టంట్ గీజర్లు. ఇందులో స్టోరేజ్ నీళ్లుండవు. ఎప్పటికప్పుడు నీళ్లు వేడెక్కి వస్తుంటాయి. ఇక రెండవది స్టోరేజ్ గీజర్. ఇందులో 5 లీటర్ల నుంచి 10 లీటర్లు 15 లీటర్లు 25 లీటర్లు కూడా ఉంటుంది. ఇన్‌స్టంట్ గీజర్లతో పోలిస్తే స్టోరేజ్ గీజర్లు ధర ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో గీజర్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ల ప్రకారం ఇన్‌స్టంట్ గీజర్ ధరకే స్టోరేజ్ గీజర్ సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడిక ప్రతి ఇంట్లో దాదాపు ఫిబ్రవరి నెల వరకూ గీజర్ అవసరం ఉండనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే గీజర్లపై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. తక్కువ ధరకే గీజర్లు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంకా సులభంగా చెప్పాలంటే ఇన్‌స్టంట్ గీజర్ ధరకే స్టోరేజ్ గీజర్ తీసుకోవచ్చు. కొన్ని కంపెనీల ఇన్‌స్టంట్ గీజర్ 3 వేల నుంచి 4 వేల వరకూ ఉంటుంది. ఇదే ధరకు అంటే కేవలం 3,999 రూపాయలకు ఇప్పుడు 25 లీటర్ల స్టోరేజ్ గీజర్ సొంతం చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజం ఇది. అద్భుతమైన ఆఫర్. లాంగ్ వే కంపెనీకు చెందిన 25 లీటర్ల స్టోరేజ్ గీజర్‌ను కేవలం 3,999 రూపాయలకే పొందవచ్చు. ఈ గీజర్ అసలు ధర 6,684 రూపాయలు కాగా 40 శాతం డిస్కౌంట్‌తో 3,999 రూపాయలు అందుతోంది. ఇది కాకుండా ఇంకా ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 

లాంగ్ వే గీజర్ పవర్ సేవింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో రస్ట్ ప్రూఫ్ పౌడర్ కోటెడ్ బాడీ ఉంటుంది. ఇందులో ఆటో కట్ ఆప్ టెక్నాలజీ ఉంటుంది. ఇన్నర్ ట్యాంక్‌పై 24 నెలలు, ఎలక్ట్రికల్ పరికరాలపై 12 నెలల వారెంటీ ఉంటుంది. ఇన్నర్ ట్యాంక్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో నిర్మించి ఉంటుంది. 

Also read: Electric Car: హర్షద్ మెహతాను ఆకర్షించిన లెక్సస్ కారు, 2025 లోగా ఎలక్ట్రిక్ కారుకు సన్నాహాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News