Flipkart Sale: బోట్, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ నడుస్తోంది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్, బోట్స్ ఇలా వివిద బ్రాండెట్ నెక్‌బ్యాండ్స్‌పై ఊహించని డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2022, 09:13 PM IST
Flipkart Sale: బోట్, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ అక్టోబర్ 11 నిన్నటి నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 16 వరకూ కొనసాగనుంది. బిగ్ బిలియన్ డే సేల్స్ తరువాత మరోసారి ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లు ఆఫర్లు అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్, యాక్సెసరీస్ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆరు రోజులపాటు నడిచే ఈ బిగ్ దీవాళి సేల్‌లో పలు బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఇందులో నెక్‌బ్యాండ్స్, స్టైలిష్ ఇయర్‌ఫోన్స్ చాలా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

OnePlus Bullets Wireless Z2

ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఇందులో 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రెడ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇన్‌కమింగ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ఇయర్‌ఫోన్స్‌లో ఇన్‌లైన్ మైక్రోఫోన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది వైర్‌లెస్ కనెక్టివిటీ బ్లూటూత్ 5.0తో అనుసంధానితమైంది. దీని ధర కేవలం 1699 రూపాయలు మాత్రమే.

Boat Rockerz 255 Pro+

ఇవి 72 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 1099 రూపాయలకు లభిస్తున్నాయి. వైర్‌లెస్ ఇయర్‌పోన్ బ్లూటూత్ వెర్షన్ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. వీటి పరిధి 10 మీటర్లు ఉంటుంది. డివైస్‌లో 40 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇది వాటర్, స్వెట్టింగ్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంది. 

Realme Buds Wireless 2 Neo

వీటి అసలు ధర 1499 రూపాయలు కాగా 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌ఫోన్స్ 11.2 మిల్లీమీటర్ల బాస్ బూస్ట్ డ్రైవర్ ఆధారంగా ఉంటుంది. 17 గంటల ప్లే బ్యాక్ టైమ్ ఇందులో ప్రత్యేకత. ఇందులో వాటర్ రెసిస్టెన్స్ బాడీ ఉంది. 

Oppo Enco M32

వీటని 50 శాతం డిస్కౌంట్ అనంతరం 1499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌తో లభిస్తున్నాయి. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 20 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. మొత్తం 28 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. ఇందులో డ్యూయల్ డివైస్ స్విచ్ ఆప్షన్ ఉంది. కేవలం ఒకే ఒక క్లిక్‌తో కనెక్ట్ చేయవచ్చు.

Also read: Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, తగ్గనున్న పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News