Realme 9 @ Rs. 899: రూ.21 వేల Realme 9 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 899కే.. ఆఫర్ కొద్ది రోజులే.. త్వరపడండి!

Buy Realme 9 Smartphone Just @ Rs 899: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో డెడ్ చీప్‌గా ఫోన్ కొనేసుకోవచ్చు. కేవలం రూ. 899కే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌.. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడే చూడండి.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 20, 2023, 06:23 PM IST
  • రూ 21 వేల స్మార్ట్‌ఫోన్‌ కేవలం 899కే
  • ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
  • డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్‌
Realme 9 @ Rs. 899: రూ.21 వేల Realme 9 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 899కే.. ఆఫర్ కొద్ది రోజులే.. త్వరపడండి!

Buy Realme 9 Smartphone Just @ Rs. 899: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'రియల్‌మీ'కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటోంది. సరసమైన ధరలో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ మిగతా మొబైల్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి.. ప్రీమియం క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో డెడ్ చీప్‌గా ఫోన్ కొనేసుకోవచ్చు. కేవలం రూ. 899కే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఇంటికితీసుకెళిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

రియల్‌మీ 9 (Realme 9 Stargaze White, 128 GB, 6 GB RAM) స్టార్‌గేజ్ వైట్ వేరియంట్ మీకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్. దీని కొనుగోలుపై గతంలో ఎన్నడూ లేనంత భారీ తగ్గింపు 'ఫ్లిప్‌కార్ట్'లో ఇవ్వబడుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20,999 అయినప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 19% తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉంటుంది. ఈ ధర మీకు భారంగా ఉంటే.. మరిన్ని ఆఫర్లు మీకు ఉన్నాయి. 

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 19% తగ్గింపు తర్వాత రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16999. ఇక  ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 16100 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా మంచి కండిషన్ కలిగి ఉండాలి. ఎలాంటి డామేజ్ లేకుండా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ అయితే పూర్తి బోనస్‌ని పొందవచ్చు. పూర్తి బోనస్ వర్తిస్తే రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ మీకు రూ. 899 మాత్రమే లభిస్తుంది. కాబట్టి మీకు ఈ ఫోన్ కావాలంటే వెంటనే 'ఫ్లిప్‌కార్ట్'లో సెర్చ్ చేయండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంది. 

Also Read: King Cobra Street Food Viral Video: కింగ్ కోబ్రాను తినడం ఎపుడైనా చూశారా.. రక్తాన్ని తాగి, పేగులను తిన్న వ్యక్తి! గూస్‌బంప్స్ పక్కా  

Also Read: Cobra Jogi Viral Video: నాగుపాము కాటేసినా.. రైతుల రక్షణ కోసం బూర ఊది మరీ పట్టుకున్న జోగి! మెంటలెక్కించే వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News