Samsung Feature Phone buy only Rs 350 in Facebook Marketplace: మీరు మార్కెట్లో మంచి ఫీచర్ ఫోన్ కొనడానికి వెళితే.. కనీసం రూ. 1000 లేదా రూ. 1500 కచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేసే అతి తక్కువ మొత్తం ఇదే కాబట్టి. మీకు మరికొన్ని ఫీచర్లు కావాలంటే.. ఖరీదైన ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటికోసం రూ. 2000 నుంచి రూ. 2500 వరకు పెట్టాల్సి ఉంటుంది. అయితే మీరు ఒకేసారి బహుళ ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. మీరు రూ. 500 కంటే తక్కువ ధరతో ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌లను మార్కెట్‌లో విక్రయిస్తోంది.
ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ (Facebook Marketplace)లో ఒక విక్రేత చౌకైన శాంసంగ్ ఫీచర్ ఫోన్‌లను విక్రయిస్తున్నాడు. ఈ ఫీచర్ ఫోన్‌ల ధర కేవలం రూ. 350 మాత్రమే. ఇక్కడ విశేషమేమిటంటే.. మీరు కేవలం రూ. 350 చెల్లించి ఏదైనా ఫీచర్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి అదనపు ఛార్జ్ చేయనవసరం లేదు.
మీరు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌కి వెళ్లి మీకు కావాల్సిన ఫోన్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటి అడ్రెస్ డీటెయిల్స్ టైప్ చేస్తే.. ఫోన్ మీ వద్ద డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాతే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ సంఖ్యలో ఫీచర్ ఫోన్‌లను ఆర్డర్ చేస్తుంటే.. ముందుగా డబ్బు చెల్లించవద్దని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే కస్టమర్‌లను మోసం చేసి.. ఫోన్ పంపేముందు పూర్తి డబ్బు తీసుకునే విక్రేతలు చాలా మంది ఉన్నారు.
చిన్న వ్యాపారాన్ని నడుపుతున్న యజమానులకు ఈ ఫీచర్ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న వ్యాపారాన్ని సడుపుతూ.. అదే సమయంలో మీ ఉద్యోగుల కోసం ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా ఇది బెటర్ ఆప్షన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.