Flipkart Offers: బంపర్ ఆఫర్.. రూ.21 వేల స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.999కే..!

Flipkart Realme Days: మీకు తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా..? మీ పాత ఫోన్‌ను మార్చుకుని.. భారీ ఆఫర్‌లో ఫోన్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీకు ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్‌లో మంచి ఫోన్ అందుబాటులో ఉంది. ఓ లుక్కేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 04:20 PM IST
  • ఫ్లిప్‌కార్టులో భారీ ఆఫర్స్
  • తక్కువ ధరకే Realme 9
  • రూ.21 వేల ఫోన్.. కేవలం రూ.999కే..
Flipkart Offers: బంపర్ ఆఫర్.. రూ.21 వేల స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.999కే..!

Flipkart Realme Days: ఫ్లిప్‌కార్టులో  నిత్యం ఆఫర్ల వర్షం కురుస్తోంది. ప్రతి రోజు ఏదో ప్రొడక్ట్‌ భారీ తగ్గింపు ఉంటోంది. ప్రస్తుతం Realme Days సేల్ కొనసాగుతోంది. ఇది నవంబర్ 24 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో Realme స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. Realme 9 స్మార్ట్‌ ఫోన్‌ను వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయండి. అవును.. మీరు విన్నది నిజమే.. దాదాపు రూ.21 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. 

భారీ తగ్గింపు..

ఫ్లిప్‌కార్ట్ Realme Days సందర్భంగా Realme 9 స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. Realme 9 ప్రారంభ ధర రూ.20,999. అయితే ఇది ప్రస్తుతం రూ.16,999కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్‌పై 4 వేల రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్
 
Realme 9 ఫోన్‌పై 16 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఈ తగ్గింపు పొందవచ్చు. అయితే ఫోన్ మంచి కండిషన్‌లో ఉన్నప్పుడు..మోడల్ సరికొత్తగా ఉన్నప్పుడు మాత్రమే రూ.16 వేలు ధర ఫుల్ ఆఫ్ అందుబాటులో ఉంటుంది. మీరు పూర్తి రేటును ఆఫ్ చేయగలిగితే.. ఫోన్ ధర రూ.999 అవుతుంది.

బ్యాంక్ ఆఫర్ కూడా..

మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోకూడదనుకుంటే.. బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ.850 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా చేస్తే ఫోన్ ధర 16,149 రూపాయలకు వస్తుంది. ఎటు చూసుకున్నా.. Realme 9 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీకు ఆసక్తి ఉంటే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: CM Jagan Mohan Reddy: చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు.. టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ కొత్త పేర్లు..!  

Also Read: Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డులు మొత్తం రద్దు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News