Apple iPhone 15 Launch: నేడే గొప్ప ప్రారంభం.. ఐఫోన్ 15 సిరీస్ భారత్‌తో ఎప్పుడంటే..?

ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఈ రోజు రాత్రి 10:30 గంటలకు 'వండర్‌లస్ట్' పేరిట లాంఛింగ్ నిర్వహించనుంది. ఇందులో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్, వాచ్ ఆల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 01:10 PM IST
Apple iPhone 15 Launch: నేడే గొప్ప ప్రారంభం.. ఐఫోన్ 15 సిరీస్ భారత్‌తో ఎప్పుడంటే..?

Apple iPhone 15 Launch: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ యాపిల్ భారీ ఈవెంట్ కు సిద్ధమైంది. నేడు (సెప్టెంబరు 12) 'వండర్‌లస్ట్' పేరిట లాంఛింగ్ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్, వాచ్ ఆల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రోగ్రామ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబరు 12 రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానెల్, యాపిల్.కామ్ వెబ్ సట్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ డెవలపర్ యాప్స్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. 

'వండర్‌లస్ట్' ఈవెంట్ లో ఐఫోన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను యాపిల్ కంపెనీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ వేరియంట్స్ రిలీజ్ కానున్నాయని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్స్ అతి త్వరలోనే భారతీయ విపణిలోకి ప్రవేశించనున్నాయని తెలుస్తోంది. గతంలో ఐఫోన్ సిరీస్ విడుదలైన చాలా రోజుల తర్వాత కాకుండా.. ఇప్పుడు కేవలం 2 లేదా 3 వారాల్లో అందుబాటులోకి రానుందట. 15 సిరీస్ ఎప్పటిలాగ లైటనింగ్ పోర్ట్ బదులుగా.. USB టైప్ - సి పోర్ట్ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, కర్డ్వ్ డిస్ ప్లే లాంటి ఫీచర్స్ అదనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Chandrababu: చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్

ఏవి విడుదల చేస్తారు?
ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ IOS 17, ఐప్యాడ్ OS 17, MAC OS 14, TV OS 17, వాచ్ OS 10, MAC OS సోనోమా వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కి సంబంధించిన అప్ డేట్స్ గురించి ఈ 'వండర్‌లస్ట్' ఈవెంట్ లో ప్రకటన చేసే అవకాశం ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ సిరీస్ ఆల్ట్రా 9 కూడా విడుదల అయ్యే అవకాశం ఉందట. ఇకపోతే ఎయిర్ పాడ్స్ పోర్ USB - C పోర్టుతో రానుందని సమాచారం. మరికొద్ది గంటల్లో అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ధర, ఫీచర్స్, డిస్ ప్లే ఎలా ఉండబోతుందే నేటి రాత్రికి తెలిసిపోతుంది.

Also Read: Heavy Rains: ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News