iPhone 13 Offers: అమెజాన్‌లో ఐఫోన్ 13 కేవలం 15 వేలకే, ఎలాగంటే

iPhone 13 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 13 ఫోన్‌ను కేవలం 15 వేలకే కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తోందనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2024, 04:21 PM IST
iPhone 13 Offers: అమెజాన్‌లో ఐఫోన్ 13 కేవలం 15 వేలకే, ఎలాగంటే

iPhone 13 Offers: ఐఫోన్ అంటే అందరికీ మక్కువ ఎక్కువే. ప్రతి ఒక్కరికీ కొనాలని ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా వెనుకంజ వేస్తుంటారు. అలాంటివారికి ఇది శుభవార్త, ఐఫోన్ 13పై ప్రముఖ  ఈ కామర్స్ దిగ్గజ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆపిల్ ఉత్పత్తుల్లో అత్యధిక ఆదరణ పొందిన మధ్య స్థాయి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 13. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ వాస్త ధర 59,900 రూపాయలు కాగా ఇప్పుడు 52,090 రూపాయలు అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 అనేది మోడల్ బ్లూ, పింక్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, గ్రీన్, రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ట్రేడ్ ఇన్ ఆఫర్ నడుస్తోంది. దీని ప్రకారం పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 34, 150 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా అమెజాన్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 2,604 రూపాయలు అదనపు డిస్కౌంట్ అందుతుంది. దాంతో ఈ ఫోన్ ధర 15, 336 రూపాయలవుతుంది. 

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్, ఇతరులకు 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఐఫోన్ 13 అనేది 2532×1170 రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులో 6.1 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 1200 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 13 అనేది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమేరాతో వస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. 

ఐఫోన్ 13 లో సిరామిక్ షీల్డ్ రక్షణ కవచం ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఏ15 బయోనిక్ చిప్‌‌సెట్, హెచ్‌డి డిస్‌ప్లే , డాల్బీ విజన్ సపోర్ట్ ఫీచర్లతో ఉంది. ఫోన్ పనితీరు, ఇతర విషయాల్లో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఐఫోన్ 13. అమెజాన్‌లో ఐఫోన్ 13 పై అందుతున్న ట్రేడ్ ఇన్ ఆఫర్ పరిమితమైంది. అందుకే ఈ ఆఫర్ కావాలంటే త్వరపడాల్సిందే.

Also read: EPFO Rule: పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఇక 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఎలాగంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News