Pocket Fan: జేబులో పెట్టుకునే త్రీ ఇన్ వన్ ఫ్యాన్, లైట్, మిర్రర్, కేవలం 349 రూపాయలే

Pocket Fan: సోషల్ మీడియాలో కన్పించే వివిధ రకాల డివైస్‌ల గురించి చాలామందికి సమాచారముండదు. అటువంటిది ఓ విభిన్నమైన మల్టీపర్సస్ పోర్టబుల్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2022, 10:04 PM IST
Pocket Fan: జేబులో పెట్టుకునే త్రీ ఇన్ వన్ ఫ్యాన్, లైట్, మిర్రర్, కేవలం 349 రూపాయలే

Pocket Fan: సోషల్ మీడియాలో కన్పించే వివిధ రకాల డివైస్‌ల గురించి చాలామందికి సమాచారముండదు. అటువంటిది ఓ విభిన్నమైన మల్టీపర్సస్ పోర్టబుల్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం..

ఆన్‌లైన్ ఈ కామర్స్ వేదికల్లో వివిధ రకాల విభిన్నమైన ఉత్పత్తులు కన్పిస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేవారికి చాలా రకాల ఉత్పత్తులు కన్పిస్తాయి. అటువంటిదే ఓ విభిన్నమైన మల్టీపర్పస్ డివైస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కన్పిస్తోంది. అదిప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇదొక పోర్టబుల్ ఫ్యాన్ మాత్రమే కాకుండా మల్టీపర్పస్ డివైస్. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆ డివైస్ వివరాలు మీ కోసం..

శివ్ మెడికోస్ ఎల్ఈడీ లైట్ మిర్రర్ ఫ్యాన్ ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇదొక పోర్టబుల్ టేబుల్ ఫ్యాన్. ప్రత్యేకత ఏంటంటే మీ జేబులో పట్టేస్తుంది. అలాగని ఇదేమీ సాధారణమైన పోర్టబుల్ ఫ్యాన్ కానే కాదు. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌లో ఒక ఎల్ఈడీ రింగ్ లైట్ కూడా ఉంటుంది. అద్భుతమైన వెలుగునిస్తుంది. దాంతోపాటు ఇందులో ఓ అద్దం కూడా ఉంది. ఇదొక గ్రూమింగ్ కిట్‌లా పనిచేస్తుంది. 

ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేసే డివైస్. చాలా సులభంగా బ్యాగ్ లేదా జేబులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. దీని ధర కేవలం 349 రూపాయలు మాత్రమే. ఇందులో ఉండే ఎల్ఈడీ వెలుగు అద్భుతంగా ఉంటుంది. మేకప్ చేసుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సెల్ఫీ లైట్‌లా కూడా ఉపయోగపడుతుంది. 

Also read; Multibagger Stocks: నాలుగేళ్ల వ్యవధిలో లక్ష రూపాయల్ని 8 లక్షలు చేసిన షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News