Realme 10 Pro 5G Price: రూ. 649కే రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.. ఈ అవకాశం మళ్లీ రాదు! ఆఫర్ రెండు రోజులు మాత్రమే

Purchage Realme 10 Pro 5G Only Rs 649 in Flipkart. 20 వేల రూపాయల విలువైన రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 649 రూపాయలకే మీరు కొనుగోలు చేయవచ్చు. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 6, 2023, 12:48 PM IST
  • రూ. 649కే రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్
  • ఈ అవకాశం మళ్లీ రాదు
  • ఆఫర్ రెండు రోజులే
Realme 10 Pro 5G Price: రూ. 649కే రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.. ఈ అవకాశం మళ్లీ రాదు! ఆఫర్ రెండు రోజులు మాత్రమే

Buy Realme 10 Pro 5G Just Rs 649: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'రియల్‌మీ'కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేస్తూ.. మార్కెట్‌లో సత్తాచాటుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే రియల్‌మీ 10 సిరీస్‌ని విడుదల చేసింది. రియల్‌మీ 10 ప్రో 5G (Realme 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ చాలా చౌకగా దొరుకుతుంది. 20 వేల రూపాయల విలువైన ఈ ఫోన్‌ను కేవలం 649 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం. 

Flipkart Big Bachat Dhamaal Sale:
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్' సేల్ నేడు ఆరంభం అయింది. ఈ సేల్ మార్చి 3 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ సెల్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. మీరు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ సెల్ బాగా ఉపయోగపడుతుంది. 20 వేల రూపాయల విలువైన రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 649కి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

Realme 10 Pro 5G Offers:
రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 10 Pro 5G 128 GB) 128 జీబీ లాంచ్ ధర రూ. 20,999. అయితే 'బిగ్ బచత్ ధమాల్' సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో 9 శాతం తగ్గింపు ఇవ్వబడుతోంది. అప్పుడు ఈ ఫోన్ రూ. 18,999కి మీకు అందుబాటులో ఉంది. ఈ ధర మీకు భారం అయితే.. మరో మంచి ఆఫర్ కూడా మీకు ఉంది. 

Realme 10 Pro 5G Exchange Offer:
రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇది ఈ ఫోన్ ధరను భారీగా తగ్గిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ. 18,350 తగ్గింపు ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. ఇంత తగ్గింపు పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉండి, మోడల్ లేటెస్ట్‌గా ఉంటేనే రూ.18,350 పూర్తి ఎక్స్‌ఛేంజ్ వర్తిస్తుంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్ వస్తే.. రూ. 649కే రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

Also Read: Shani Uday 2023: మార్చి 6న కుంభ రాశిలో శని ఉదయం.. ఈ రాశుల వారి పని ఔట్! అజాగ్రత్తగా ఉంటే అంతే 

Also Read: Mahindra Thar Price Hike 2023: 'థార్' కార్ ప్రియులకు షాక్.. ధరలను పెంచేసిన మహీంద్రా! పూర్తి వివరాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News