సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నాయనే తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా అని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ ఏడు రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకు అమరావతి ఉద్యమం ఉద్ధృతమవుతోంది.
ఏపీకి మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని టీడీపి నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జిఎన్ రావ్ నివేదిక ఇవ్వకముందే ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారంటే.. ఆ రిపోర్టును ఎవరు తయారు చేశారో స్పష్టంగా అర్థం అవుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనను జనసేన పార్టీ తప్పుపట్టింది. అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. రాజధాని వికేంద్రీకరణ కాదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తర్జనభర్జనలు జరుగుతుండగానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన చర్చనియాంశమైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అమరావతిని చట్టసభలకు రాజధానిగా, ప్రభుత్వ కార్యకలాపాల కోసం విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.