బంగారం ధరలురోజురోజుకు దిగువకు చేరుకుని, పసిడి ప్రియులకు మరీంత ఊరట కలిగిస్తున్నాయి. అయితే వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణం భారత్‌లో బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాక్‌లోని అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే బంగారం ధరలకు మరింత రెక్కలొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.