ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ వ్యాక్సిన్ కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ( 3rd Phase Trials ) మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford Vaccine ) వ్యాక్సిన్ తుది ట్రయల్స్ ను ఇండియాలో ఆగస్టు నెలలో జరపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) విషయంలో ఇప్పడు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ధర నిర్ణయమైంది. ఇప్పుడు పేరు కూడా ప్రకటితమైంది. ఆ పేరేంటో తెలుసా..
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రపంచం ఎదురుచూస్తున్న ఆక్స ఫర్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న ఇండియన్ కంపెనీ ఆ కీలక విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్ ఉత్పత్రిలో 50 శాతం భారత్ కే కేటాయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ను కనుగొనడంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ పరిశోధనలు సత్ఫలితాలనందించాక పరిస్థితి ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టేసిన నేపధ్యంలో సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఆ కంపెనీలకుందా అసలు? ఈ ప్రశ్నకు సమాధానం బిల్ గేట్స్ ( BillGates ) చెబుతున్నారు. ఒక్క భారతదేశానికే ఆ సామర్ధ్యముందంటున్నారు.
దేశాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సీన్ ( corona vaccine ) కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్సాక్సీన్ అందుబాటులో వస్తే తొలి వ్యాక్సీన్ ను కరోనాతో పోరాడుతున్న యోధులకు ( corona warriors ) ఇవ్వాలని ప్రదాని మోదీ ( PM Narendra Modi ) నిర్ణయించారు. పోస్ట్ వ్యాక్సీన్ ప్రణాళికపై మోదీ అద్యక్షత సమావేశం జరిగింది.
Vaccine to check Coronavirus: కరోనావైరస్కు వ్యాక్సీన్ అక్టోబర్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయా అంటే అవుననే అంటోంది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ). అదే కానీ జరిగితే కరోనా వ్యాక్సీన్‌ను భారత్‌తో సహా ప్రపంచదేశాలకు అందించే సంస్థగా భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India ) కి ఖ్యాతి దక్కనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.