రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కరోనా లాక్డౌన్లో తను ఇష్టపడిన అమ్మాయి మిహీక బజాజ్‌ను ( Miheeka Bajaj ) ఒప్పించి ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ప్రస్తుతం ఫారిన్‌కి వెకేషన్ కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది వారి హనీమూన్ ట్రిప్ అయి ఉండొచ్చు అని టాక్. రానా దగ్గుబాటి, మిహీక కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటోను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో వారిద్దరు ఒక బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది!
కొద్ది రోజుల క్రితం వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న రానా దగ్గుబాటి ( Rana Daggubati ).. సరిగ్గా పది రోజుల క్రితమే పెళ్లి చేసుకొని భార్య మిహీక బజాజ్‌తో ( Miheeka Bajaj ) కలిసి మీవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. అలాగే రానా పెళ్లి ఫొటోలు ( Rana Daggubati's wedding photos ) సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.