యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమాతో ( Radheshyam movie ) బిజీగా ఉన్నాడు. తాజాగా ఇటలీలో షూటింగ్ ముగించుకొని నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ చేరుకుంది ఈ చిత్ర బృందం. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తిరిగి నవంబర్ 5 నుండి అన్నపూర్ణ స్థూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో మిగిలిన షూటింగ్ జరగనుంది అని టాక్.
తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.
ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ( Prabhas in Adipurush ) తన 22వ చిత్రాన్ని ప్రకటించి తన అభిమానులకు మాంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా రెగ్యులర్ మూవీ కాకుండా మరో భారీ ప్రాజెక్టుకి ప్రభాస్ సైన్ చేశాడని తెలిశాకా యంగ్ రెబల్ స్టార్ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.