Balasore Train Accident Case: సంచలనం సృష్టించిన కోరమండల్ రైలు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం ఘటనకు సంబంధించి శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముగ్గురుని అదుపులోకి తీసుకుంది. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం.
Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది.
Reason Behind Odisha Train Accident: ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్‌కి కారణమైన ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశిస్తూ ఇండియన్ రైల్వే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ పరిధిలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ విచారణ కమిటికి నేతృత్వం వహిస్తున్నారు. ఒకవైపు రైల్వే ట్రాక్ పురరుద్ధరణ పనులు జరుగుతుండగానే మరోవైపు విచారణ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది.
Odisha Train Tragedy: ఒడిషా రైలు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుంది అని అన్నారు.
Coromandel Express train Tragedy: ఒడిషాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాదం దుర్ఘటన దేశ చరిత్రలోనే అతి పెద్ద ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒడిషా రైలు ప్రమాదంలో దుర్మరణంపాలైన వారి సంఖ్య 261 కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.