Car Hit And Run Case in Hyderabad: మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST act POA 1989 ) నమోదైంది. యాచారం ఎంపీపీ సుకన్య చేసిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.