అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ తీరుపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను చదివి వినిపించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులని చంద్రబాబు కోరారు.
వైసీపీ నుంచి ఎంపీ బుట్టారేణుక టీడీపీలోకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు రేణును కాదని..వేరొకరికి రంగంలోకి దించాలని వైసీపీ భావిస్తోంది. తాజా పరిణమాలను గమనించిన సిట్టింగ్ ఎంపీ రేణుక గత కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆమె పార్టీ వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంలో ఆమె సందర్భంగా కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.