India Vs New Zealand 2nd Test Playing 11: సొంతగడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ జట్టు ఊహించని విధంగా షాకిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టెస్ట్ సిరీస్ నెగ్గాలంటే టీమిండియా చివరి రెండు టెస్టుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ వేశారు.
Kane Williamson Injury: రానున్న రెండు నెలల కాలం పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson News) క్రికెట్ కు దూరం కానున్నాడని కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. మోచేతి గాయం కారణంగా విలియమ్సన్ కు రెండు నెలల విశ్రాంతి అవసరమని ఆయన తెలిపాడు. గాయం కారణంగా టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో (IND vs NZ 2nd Test 2021) కేన్ ఆడని విషయం తెలిసిందే!
IND VS NZ: భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 62 పరుగులకే చాపచుట్టేసింది. అశ్విన్ (4/8), మహమ్మద్ సిరాజ్ (3/19) కివీస్ పతనాన్ని శాసించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.