When Will Be EPFO Interest credited: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి వారికి రావాల్సిన వడ్డీ డబ్బులు జమ అవడం మొదలైంది. ప్రస్తుతానికి కొన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మాత్రమే వడ్డీ జమ కాగా .. ఆగస్టు నెల ముగిసేలోగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల అందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అవనున్నట్టు తెలుస్తోంది.
EPF Money For Marriages: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Free Life Insurance Scheme to EPF Subscribers: ఒకవేళ ఏ కారణం వల్లయినా ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగానే చనిపోయినట్టయితే.. వారి ఖాతాలో అప్పటి వరకు జమ అయిన పిఎఫ్ మొత్తంతో పాటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా కలిపి నామిని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో నామినిగా ఎవరి పేరు అయితే ఉంటుందో.. వారి పేరే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోనూ నామినిగా ఉంటుంది.
EPFO interest rates in FY 2020-21 : న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆర్థిక సంక్షోభంలో పడిన చాలా మంది ఆర్థిక వెసులుబాటు కోసం తమ EPFO account లో దాచుకున్న డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుల వెసులుబాటు కోసం వారి నుంచి ఇపిఎఫ్ఓ తక్కువ మొత్తంలో EPF Money కట్ చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో EPFO ఖాతాల్లో డిపాజిట్ అయ్యే మొత్తం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.