Eamcet 2022 Exam: తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. అక్టోబరు 11 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అక్టోబరు 11, 12 తేదీల్లో రెండో విడత బుకింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
TS EAMCET 2022 : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు.
Telangana Eamcet 2022: తెలంగాణలో భారీ వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగనున్నాయని వాతవారణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ పరిస్థితి ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలపై పడనుందా..
Telangana EAMCET 2022: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు.. వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు మరియు ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు.. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
Telangana EAMCET: తెలంగాణలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఐదు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈనెల 14,15 తేదీలలో జరిగే ఎంసెట్ పైనా భారీ వర్షాల ప్రభావం పడింది. వర్షాలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఎంసెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి
Telangana EAMCET and ECET schedule: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఎంసెట్ పరీక్షను జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.