IND vs NZ 5th ODI: కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

Last Updated : Feb 3, 2019, 02:33 PM IST
IND vs NZ 5th ODI: కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

వెల్లింగ్టన్‌: భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు వెల్లింగ్టన్‌లో జరుగుతున్న చివరి వన్డేలో కివీస్ జట్టు 135 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. టీమిండియా నిర్దేశించిన 253 ప‌రుగుల విజయ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ జట్టు ఆదిలోనే 11 ఓవర్లలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా ఆ తర్వాత కెప్టేన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేదార్ జాదవ్ బౌలింగ్‌లో 39 వ్యక్తిగత పరుగుల వద్ద శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 119 వద్ద వుండగా యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (46 బంతుల్లో 37 పరుగులు) సైతం ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లాథమ్ స్థానంలో క్రీజులోకి వచ్చిన డి గ్రాండ్‌హమ్ సైతం చాహల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్యూ అవడంతో జట్టు 135 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. 

వికెట్ల వేటలో మొహమ్మద్ షమి, యుజ్వేంద్ర చాహల్‌కు చెరో రెండు, హార్థిక్ పాండ్యా, కేదార్ జాధవ్‌లకు చెరో వికెట్ దక్కింది.

Trending News