Superstar Spectacle Event: WWE పోటీలకు ముస్తాబైన హైదరాబాద్.. బరిలో వరల్డ్ రెజ్లింగ్.. ట్రాఫిక్ మల్లింపు!

డబ్ల్యూడబ్ల్యూఈ (WWE).. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్.. టీవీల్లోనే కానీ.. నేరుగా చూసిందే లేదు. ఇపుడు సూపర్‌స్టార్ స్పెక్టకిల్ పేరుతో ఈవెంట్ మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ షో కారణంగా ట్రాఫిక్ మల్లింపు జరిగింది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2023, 07:50 PM IST
Superstar Spectacle Event: WWE పోటీలకు ముస్తాబైన హైదరాబాద్.. బరిలో వరల్డ్ రెజ్లింగ్.. ట్రాఫిక్ మల్లింపు!

Superstar Spectacle Event in Hyderabad: డబ్ల్యూడబ్ల్యూఈ WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) ఈవెంటు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లు టీవీల్లో చూసిన ఈ కుస్తీ పోటీలు.. ఇప్పుడు మన నగరం నడిబొడ్డున జరుగబోతున్నాయి. ఆరేళ్ల తర్వాత భారత్లో తొలిసారి డబ్ల్యూడబ్ల్యూఈ పోరుకు సర్వం సిద్ధమైంది.ఈ సారి భారత రెజ్లర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. 

ఇప్పటికే తన వైవిధ్యమైన ఆటతీరుతో లెక్కకు మిక్కిలి టైటిళ్లు కొల్లగొట్టిన జాన్సేనా.. ఫ్రీకిన్ రోలిన్స్ జతగా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్ కైసర్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఇండస్ షేర్ (సంగా, వీర్), కెవిన్ ఒవెన్స్, సమి జైన్ మధ్య ఫైట్ జరుగుతుంది. 

మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టైటిల్ కోసం రియా రిప్లే, నటాల్యతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్లెట్రీ, షాంకీ, రింగ్ జనరల్ గుంతర్, జియోనీ విన్సీ బరిలో దిగనున్నారు. భారత్ నుంచి జిందర్ మహల్.. డబ్ల్యూడబ్ల్యూఈలో పోటీపడుతున్న భారత రెజ్లర్.

విదేశాల్లో విరివిగా జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో పాల్గొనే మన దేశ రెజ్లర్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒకవేళ బరిలోకి దిగినా.. గుర్తింపు దక్కని రెజ్లర్లు చాలా మంది. కానీ బాహుబలి గ్రేట్ కాళీ వారసునిగా జిందర్ మహల్ డబ్ల్యూడబ్ల్యూఈలో దుమ్మురేపుతున్నాడు. కెరీర్ తొలి నాళ్లలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న జిందల్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 

2016లో మళ్లీ బౌట్లో అడుగుపెట్టిన జిందల్.. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో స్టార్ రెజ్లర్లను మహల్ మట్టికరిపించాడు. జెయింట్ మెమోరియల్ బాటిల్ రాయల్ టోర్నీలో రన్నరప్ గా నిలిచి సత్తాచాటాడు. స్టార్ రెజ్లర్ ర్యాండీ ఓర్టన్ ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. భారత్ నుంచి జిందర్ మహల్తో పాటు ఇండస్ షేర్ (వీర్ మహాన్, సంగా) కూడా ఉన్నారు.

Also Read: Huawei Mate X5 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ ఫోల్డబుల్ మొబైల్‌ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్‌ అవుతారు!  

గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్పెక్టాకిల్‌ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈసారి భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు 28 మంది బరిలో నిలిచారు.

డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌ టీమ్‌ టైటిల్‌ కోసం ఇండస్‌ షేర్‌,సంగా,వీర్‌,కెవిన్‌ ఒవెన్స్‌, సమి జైన్‌ మధ్య ఫైట్‌ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ టైటిల్‌ కోసం నటాల్యతో రియా రిప్లే అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్‌స్టార్ స్పెక్టకిల్ పేరుతో ఈవెంట్ జరగనుంది 

ఈ మేరకు ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి హెచ్‌సీయూ వైపు ప్రయాణించే వాహనదారులు, కొండాపూర్ మార్గము నుంచి వెళ్లాలని సూచించారు.మరోవైపు నల్లగండ్ల నుంచి గచ్చిబౌలి జంక్షన్ వచ్చే వాహనదారులు మసీద్ బండ- కొండాపూర్- బొటానికల్ గార్డెన్ మీద నుంచి వాహనదారులు వెళ్లాలని కోరారు.

Also Read: Petrol And Diesel Prices: శుభవార్త.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News