World Cup 2023: ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఇవే.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం

Virender Sehwag Predicts Four Semi Final Teams: భారత్ వేదిక జరిగే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశారు. టీమిండియాతోపాటు పాక్, ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని జోస్యం చెప్పారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 13, 2023, 02:06 PM IST
World Cup 2023: ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఇవే.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం

Virender Sehwag Predicts Four Semi Final Teams: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్లేయర్లను రెడీ చేసుకునే పనిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా అందరి కంటే ముందు వరల్డ్ కప్‌ టీమ్‌ను ప్రకటించి.. విశ్వకప్ వేటను ప్రారంభించింది. ఆసియా కప్ అనంతరం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అప్ఘానిస్థాన్ జట్లు ఆటగాళ్లను ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సొంతగడ్డపై హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెమీ ఫైనల్ చేరే జట్లను అంచనా వేశారు.  

భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉందని సెహ్వాగ్ అన్నారు. ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు కచ్చితంగా సెమీస్‌లో అడుగుపెడతాయని జోస్యం చెప్పారు. ఈ రెండు జట్ల ఆటతీరు ప్రభావవంతంగా ఉందని.. మిగిలిన జట్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాయని తెలిపారు. ఉపఖండంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మెరుగ్గా ఆడగలవని పేర్కొన్నారు. 

రోహిత్ శర్మ నాయకత్వంలో వన్డేల్లో టీమిండియా క్రికెట్ పవర్‌హౌస్‌గా ఎదిగింది. దూకుడు బ్యాటింగ్‌తో పాటు సమతూకంతో కూడిన బౌలింగ్‌ అటాక్‌తో అన్ని జట్లకు సవాల్ విసరుతోంది. ప్రపంచకప్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధంగా ఉంది. సెమీ ఫైనల్‌ వరకు టీమిండియా ఈజీగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లాండ్.. ఆసియా పరిస్థితుల్లో టైటిల్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. బలమైన బ్యాటింగ్ లైనప్.. బౌలింగ్ విభాగంలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సెమీ ఫైనలిస్టుగా సెహ్వాగ్ పరిగణిస్తున్నారు.

వరల్డ్ కప్ ఫేవరేట్లలో మరో జట్టు ఆస్ట్రేలియా. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లు ఆసీస్ సొంతం. ఐసీసీ టోర్నమెంట్‌లలో బలమైన ట్రాక్ రికార్డు, ఒత్తిడిలో రాణించగల సత్తా ఆసీస్ స్పెషలిటీ. సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్ ఉంది. ఐసీసీ ఈవెంట్‌లలో పాకిస్థాన్‌ను ఎప్పుడు తక్కువ అంచనావేయడానికి వీల్లేదు. డార్క్‌హార్స్‌గా బరిలోకి దిగుతున్న పాక్..  బాబర్ ఆజం నేతృత్వంలో సెమీస్‌కు పోటీదారుగా ఉంది.  

Also Read: WI vs IND Dream11 Team Tips: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..   

Also Read: Telangana Politics: బీజేపీకి బిక్ షాక్.. కీలక నేత గుడ్‌బై  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News