MS Dhoni-Ravi Shastri: 'తర్వాత కెప్టెన్ ఎవరో ధోనికి తెలుసు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'..: రవిశాస్త్రి

MS Dhoni-Ravi Shastri: 2014లో టెస్టు క్రికెట్‎కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి విషయాలను పంచుకున్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 02:42 PM IST
MS Dhoni-Ravi Shastri: 'తర్వాత కెప్టెన్ ఎవరో ధోనికి తెలుసు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'..: రవిశాస్త్రి

MS Dhoni-Ravi Shastri: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని  2014 డిసెంబర్ 30న మెల్‌బోర్న్‌ (Melbourne)లో ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ డ్రా అయిన తర్వాత రిటైర్మెంట్ ( retirement ) ప్రకటించాడు. దీంతో క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది. టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆదివారం.. నాటి క్షణాన్ని గుర్తుచేసుకున్నాడు. ధోని (MS Dhoni) నిర్ణయం గురించి జట్టులో ఎవరికీ తెలియదని శాస్త్రి చెప్పారు. విరాట్ కోహ్లీ (Virat Kohli0 కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి ధోనీ ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించాడు.

''తదుపరి నాయకుడు ఎవరో ధోనికి తెలుసు. అతను ఆ ప్రకటన చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అతని శరీరం ఎంత శ్రమించగలదో అతనికి తెలుసు. అతను తన వైట్-బాల్ కెరీర్‌ను కొనసాగించాలనకున్నాడు. అందుకే ధోని రెండో ఆలోచన లేయలేదు'' అని శాస్త్రి చెప్పారు. 

Also Read: Yuvraj singh: స్పేస్​లోకి యువరాజ్​ సింగ్ తొలి సెంచరీ​ బ్యాట్​, వీడియో వైరల్

''నేను టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను అని ధోనీ మెల్‌బోర్న్‌లో చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను మామూలుగా నా దగ్గరకు వచ్చి, రవి భాయ్ నేను కుర్రాళ్లుతో మాట్లాడాలి’ అన్నాడు. ‘సరే అన్నాను. అతను డ్రా గురించి ఏదో చెప్పబోతున్నాడని నేను అనుకున్నాను. అతను బయటకు వచ్చాడు. నేను డ్రెస్సింగ్ రూమ్ చుట్టూ ఉన్న ముఖాలను చూశాను. ధోని ప్రకటన చేసినప్పుడు చాలా మంది అబ్బాయిలు షాక్‌కు గురయ్యారు. కానీ అది మీ కోసమేనని ఎంఎస్ అన్నాడని'' రవిశాస్త్రి ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News