Who is Nitu Ghanghas: నీతూ ఘన్‌ఘాస్ బయోగ్రఫీ.. సినిమా కంటే ఏం తక్కువ కాదు..

నీతూ బాగా అల్లరి పిల్ల. తోబుట్టువుతో, తోటి పిల్లలతో ఆమె కొట్లాడే తీరు చూసిన తండ్రి జై భగవాన్.. ఆమెను బాక్సింగ్‌కి పరిచయం చేశాడు. 12 ఏళ్లప్పుడు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించినప్పటికీ.. మొదట కొన్నాళ్లపాటు పెద్దగా ఫలితం కనిపించలేదు. దాంతో ఇక తన వల్ల కాదని చెప్పి బాక్సింగ్‌ని విడిచిపెట్టాలని అనుకుందామె. కానీ

Written by - Pavan | Last Updated : Mar 26, 2023, 12:50 AM IST
Who is Nitu Ghanghas: నీతూ ఘన్‌ఘాస్ బయోగ్రఫీ.. సినిమా కంటే ఏం తక్కువ కాదు..

Who is Nitu Ghanghas: నీతూ ఘన్‌ఘాస్ .. ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. దేశ రాజధాని ఢీల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుని మరోసారి దేశానికి గోల్డ్ మెడల్ అందించిన బంగారు తల్లి నీతూ ఘన్‌ఘాస్... నీతూ ఘన్‌ఘాస్ స్వస్థలం హర్యానాలోని బివాని జిల్లా ధనానా గ్రామం. 2000 సంవత్సరం అక్టోబర్ 19న పుట్టిన నీతూ ఘన్‌ఘాస్.. 22 ఏళ్లకే దేశానికి మొత్తం నాలుగు బంగారు పతకాలు అందించిన బంగారు తల్లిగా చరిత్రకెక్కింది. తల్లిదండ్రులు జై భగవాన్, ముఖేష్ దేవి దంపతులకు మొత్తం ఇద్దరు సంతానం కాగా నీతూ ఘన్‌ఘాస్ వారిలో పెద్ద కుమార్తె కాగా ఆమెకు అక్షిత్ కుమార్ అని ఓ తమ్ముడు ఉన్నాడు. 

నీతూ బాగా అల్లరి పిల్ల. తోబుట్టువుతో, తోటి పిల్లలతో ఆమె కొట్లాడే తీరు చూసిన తండ్రి జై భగవాన్.. ఆమెను బాక్సింగ్‌కి పరిచయం చేశాడు. 12 ఏళ్లప్పుడు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించినప్పటికీ.. మొదట కొన్నాళ్లపాటు పెద్దగా ఫలితం కనిపించలేదు. దాంతో ఇక తన వల్ల కాదని చెప్పి బాక్సింగ్‌ని విడిచిపెట్టాలని అనుకుందామె. కానీ తండ్రి జై భగవాన్ అందుకు అంగీకరించలేదు. నీలో ఒక బాక్సర్ ఉన్నారంటూ ఆమెలోని ప్రతిభను వెలికి తీసేందుకు తను తన ఉద్యోగానికి మూడేళ్ల పాటు సెలవు పెట్టాడు. సెలవులో ఉన్న ఆ మూడేళ్ల కాలంలో అతడికి వేతనం కూడా అందేది కాదు. కానీ తన కూతురుని బాక్సర్‌ని చేయడం కోసం అతడు దేనికైనా రెడీ అనుకున్నాడు. 

తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సేద్యం చేస్తూనే బ్యాంకు నుంచి రూ. 6 లక్షలు అప్పు చేసి మరీ తన ఖర్చులను వెళ్లదీసుకుంటూ బిడ్డను బాక్సింగ్ కోచింగ్‌కి పంపించాడు. ఆమె ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం అందిస్తూనే తనే స్వయంగా బాక్సింగ్ కోచింగ్‌ని పర్యవేక్షించేవాడు. అలాంటి సమయంలోనే నీతూలో ఉన్న బాక్సింగ్ నైపుణ్యాన్ని జగదీష్ సింగ్ గుర్తించారు. ఆయన మరెవరో కాదు.. విజేందర్ సింగ్ లాంటి బాక్సర్‌లని దేశానికి అందించిన బాక్సింగ్ కోచ్. అప్పటికే ఆయన బివాని బాక్సింగ్ క్లబ్ స్థాపించి బాక్సర్లను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజీలో బిఏ చదువుతూనే రోజూ  తండ్రి స్కూటర్‌పై 40 కిలోమీటర్లపాటు ట్రావెల్ చేసి వెళ్తూ బివాని బాక్సింగ్ క్లబ్‌లో శిక్షణకు హాజరయ్యేది. 

Nitu-Ghanghas-wins-Gold-Medal-in-Womens-world-Boxing-Championships-finals-Saweety-Boora-Gold-Medals.jpg

తొలిసారిగా..
2017 లో బల్గేరియాలో జరిగిన బల్కన్ యూత్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నీతూ ఘన్‌ఘాన్.. 48 కిలోల కేటగిరిలో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక అది మొదలు నీతూ ఘన్‌ఘాస్ వెనుదిరిగి చూడలేదు. అదే ఏడాదిలో గౌహతిలో జరిగిన ఉమెన్స్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 48 కిలోల కేటగిరీలో మరోసారి నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంది. 

2018లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నెంబర్ 1.., అదే ఏడాది సెర్బియాలో జరిగిన గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వొజ్వోడిన యూత్ మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ టోర్నమెంట్ లో 48 కిలోల కేటగిరీలో నెంబర్ 1 స్థానం..., అదే ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన యూత్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నెంబర్ 1 గా నిలిచింది. అలా 2018 ఒక్క ఏడాదిలోనే మూడు అంతర్జాతీయ వేదికలపై 48 కిలోల కేటగిరీలో మూడు ఫస్ట్ ప్లేస్ మెడల్స్ సొంతం చేసుకుంది.

2022 లో ఇంగ్లండ్‌లో జరిగిన 22వ వరల్డ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో 45-48 కిలోల కేటగిరీలో నీతూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుని భారత్‌కి బంగారు పతకాన్ని అందించింది. ఇక ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢీల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుని మరోసారి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది. మొత్తంగా దేశం తరపున నాలుగుసార్లు గోల్డ్ మెడల్ సాధించిపెట్టిన నీతూ ఘన్‌ఘాస్ లైఫ్ జర్నీ చూస్తే ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది. చిన్న వయస్సులోనే మహిళల బాక్సింగ్‌లో సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ పోటీల్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని దేశం తలెత్తుకునేలా చేసిన నీతూ ఘన్‌ఘాస్‌కి కంగ్రాట్స్ మాత్రమే కాదు.. హ్యాట్సాఫ్ కూడా చెప్పాల్సిందే.

ఇది కూడా చదవండి : Women's World Boxing Championships Finals: మహిళల బాక్సింగ్‌లో ఇండియాకు 2 గోల్డ్ మెడల్స్

ఇది కూడా చదవండి : MS Dhoni Record: ఐపీఎల్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంలో నెం.1గా ఎంఎస్ ధోని..ఇది కదా కిక్కు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News