West Indies Vs England, 5th T20I: ఇంగ్లాండ్ (England) తో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ లో (West Indies Vs England, 5th T20I) వెస్టిండీస్ 17 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20 సిరీస్ ను 3-2తేడాతో విండీస్ కైవసం చేసుకుంది. జాసన్ హోల్డర్ (Jason Holder) అదిరిపోయే ప్రదర్శన చేసి..ఆ జట్టుకు విజయానికి కట్టబెట్టాడు. అఖరి ఓవర్ లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు ప్రదర్శన చేశాడు. హోల్డర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్టిండీస్ ఆటగాడిగా హోల్డర్ నిలిచాడు.
What a match Jason holder last over 4 balls 4 wkts
Caribbean team won the final match and series by 3-2
England need last over 18 runs #WestIndies champion pic.twitter.com/SubIDtb46M— Malik Naveed🇵🇰 (@NaveedMasoom1) January 30, 2022
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ (West Indies) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లలో కెప్టెన్ పొలార్డ్(41), రోవ్‌మన్ పావెల్(35), బ్రాండన్ కింగ్(34) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 19.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్(5), అకేల్ హోసేన్(4) వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(55), బిల్లింగ్స్(41) టాప్ స్కోరర్‌లుగా నిలిచారు.
Also Read: IND vs WI: స్టార్ ఆటగాళ్లకు చోటు.. టీ20ల్లో టీమిండియాతో తలపడే వెస్టిండీస్ జట్టు ఇదే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి