Kieron Pollard: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20ల్లో అదరగొడుతున్నాడు. ఈక్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీమెంట్‌లో పొలార్డ్ ఆడుతున్నాడు. లండన్ స్పిరిట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పొలార్డ్ ఈరికార్డు సాధించాడు.
తనకు ప్రతిష్టాత్మకమైన 600వ మ్యాచ్‌లో అతడు 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో భీకర ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. అతడు క్రీజులో ఉండే భారీ స్కోర్ నమోదు కాక తప్పదు. 600 మ్యాచ్‌ల్లో 31.34 సగటుతో 11 వేల 723 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ..56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బౌలింగ్‌లో 309 వికెట్లు తీశాడు. ఇందులో 4/15 బెస్ట్ బౌలింగ్‌గా ఉంది.దాదాపు 15 ఏళ్ల నుంచి టీ20 ఆడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టోర్నీమెంట్లను ఆడాడు. వెస్టిండీస్ జాతీయ జట్టుకు సైతం సేవలు అందించాడు. ఈజాబితాలో పొలార్డ్ తర్వాత డ్వేన్ బ్రావో 543, షోయబ్ మాలిక్ 472, క్రిస్ గేల్ 463, రవి బొపారా 426 మ్యాచ్‌లు ఆడారు.
మొత్తంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అదరగొట్టడంతో 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. పొలార్డ్‌తోపాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 37 పరుగులు , ఓపెనర్ జాక్ క్రాలీ 41 పరుగులు సాధించారు. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్య చేధనకు దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను థాంప్సన్ దెబ్బతీశాడు. అతడి ధాటికి 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జోర్డాన్ థాంప్సన్ 15 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఈమ్యాచ్‌లో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also read:Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook