Viral Video: నాకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు? కోహ్లీ ఆన్సర్ తో షాక్ అయిన కార్తీక్, వీడియో వైరల్

IPL 2024: ఐపీఎల్ ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా అతడు తన టీమ్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. అందులో కార్తీక్ ప్రశ్నకు కోహ్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 20, 2024, 06:42 PM IST
Viral Video: నాకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు? కోహ్లీ ఆన్సర్ తో షాక్ అయిన కార్తీక్, వీడియో వైరల్

Virat Kohli And Dinesh Karthik video viral: ఐపీఎల్ 17వ సీజన్ లో ఆర్సీబీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు అంతా విఫలమైన తను మాత్రం పోరాడుతూ మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన కార్తీక్ 75.33 సగటుతో 226 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో 205.45 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తూ రాబోయే వరల్డ్ కప్ జట్టు రేసులో తాను ఉన్నట్లు చాటి చెప్పాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో బెంగళూరు జట్టు పూర్తిగా నిరాశపరిచింది. ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడగు స్థానంలో ఉంది. తర్వాత జరగబోయే మ్యాచుల్లో గెలిస్తేనే ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉంది. 

కార్తీక్ ప్రశ్నకు కళ్లుచెదిరే సమాధానం చెప్పిన కోహ్లీ..
ఇదిలా ఉంటే, స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ తన జట్టులోని కొంత మంది ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్, రజత్ పటీదార్ పాల్గొన్నారు. ముందుగా కార్తీక్ తన గురించి ఒక ప్రశ్న అడిగాడు. నాకు క్రికెట్లో కాకుండ, ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు? అని అడగ్గా, దానికి కోహ్లీ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు విరాట్ "మీ భార్య" అని జవాబిచ్చాడు. దీంతో అందరూ పడిపడి నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కార్తీక్ భార్య భారత స్క్వాష్ క్రీడాకారిణి అయిన  దీపికా పల్లికల్ ను 2015లో వివాహం చేసుకున్నారు. 

కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
ఆర్సీబీ రేపు ఈడెన్ గార్డెన్ వేదికగా కేకేఆర్ తో తలపడుబోతుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు గ్రీన్ జెర్సీతో దిగనుంది. కోల్‌కతా, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 33 ఐపీఎల్ మ్యాచుల్లో తలపడగా.. కేకేఆర్ 19, ఆర్సీబీ 14 మ్యాచులు గెలిచాయి. ఆర్సీబీపై కోల్‌కతా అత్యధిక స్కోరు 222 మరియు కేకేఆర్ పై రాయల్ ఛాలెంజర్స్ అత్యధిక స్కోరు 213. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, బెంగళూరు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో అయ్యర్ సేన ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఆ జట్టు మెుదట బ్యాటింగ్ చేసినప్పుడు ఐదు సార్లు నెగ్గింది. 

Also Read: IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!

Also Read: IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News