Virat Kohli: నా ప్రధాన లక్ష్యం అదే.. అందుకోసం ఏమైనా చేస్తా: విరాట్ కోహ్లీ

Virat Kohli wants to win World Cup 2022 title for India. ఆసియా కప్, ప్రపంచకప్‌లలో భారత్‌ను గెలిపించడమే తన ప్రధాన లక్ష్యమని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 24, 2022, 05:22 PM IST
  • నా ప్రధాన లక్ష్యం అదే
  • అందుకోసం ఏమైనా చేస్తా
  • పారిస్ వెకేషన్‌లో విరాట్ కోహ్లీ
Virat Kohli: నా ప్రధాన లక్ష్యం అదే.. అందుకోసం ఏమైనా చేస్తా: విరాట్ కోహ్లీ

Virat Kohli wants to win World Cup 2022 title for India: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి రెస్ట్ తీసుకున్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి పారిస్ వెకేషన్‌కు వెళ్లాడు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం కోహ్లీ నేరుగా పారిస్ వెళ్లాడు. కోహ్లీ తిరిగి జింబాబ్వే పర్యటనతో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆపై ఆసియా కప్‌లో బరిలోకి దిగన్నాడు. యూఏఈ వేదికగా ఆగస్ట్‌ 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనున్నాయి. 

ఆసియా కప్‌ అధికార బ్రాడ్ కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇటీవలే ఓ వీడియోను వదిలిన స్టార్ స్పోర్ట్స్.. తాజాగా మెగా టోర్నీని ఉద్దేశించి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ తన ప్రధాన లక్ష్యం ఏంటో చెప్పాడు. 'ఆసియా కప్, ప్రపంచకప్‌లలో భారత్‌ను గెలిపించడమే నా ప్రధాన లక్ష్యం. అందుకోసం నేను జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని కోహ్లీ అన్నాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది.

కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేదనే అప్రతిష్ట విరాట్ కోహ్లీపై ఉంది. కోహ్లీ సారథ్యంలో ఆడిన భారత్ 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై పరాజయం పాలైంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ 2020 ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలోనే పరాభవం పొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌ 2021లో లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన కొహ్లీ.. ఆటగాడికైనా పట్టాలని చూస్తున్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ప్రపంచకప్‌, ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడే. 

Also Read: PV Sindhu Bonalu 2022: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు!

Also Read: పాట పాడుతూ ఆవును ఆటపట్టిందామనుకున్న యువకుడు.. చివరికి ఏమైందో చుడండి! నవ్వు ఆపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News