వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

Last Updated : Sep 30, 2018, 08:25 AM IST
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

విండీస్‌తో జరగబోయే 2 టెస్టుల సిరీస్‌కు జట్టు ఎంపికలో సెలెక్టర్లు యువకులకు అవకాశం కల్పించారు. సెలెక్టర్లు కొందరు కీలక ఆటగాళ్లపై వేటు వేయగా.. మరికొందరికి విశ్రాంతినిచ్చారు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన ధావన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకున్నారు. మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌కి, ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికై ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని కరుణ్‌ నాయర్‌ను కూడా సెలక్టర్లు అవకాశమివ్వలేదు.

అటు వరుస సిరీస్‌లు ఆడుతున్న బౌలర్లు భువనేశ్వర్‌, బుమ్రాలతో పాటు ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న ఇషాంత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యలను కూడా విండీస్ సిరీస్‌కు దూరం పెట్టారు. బుమ్రా స్థానంలో హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు తొలిసారి జట్టులో స్థానం దక్కింది. అండర్‌-19 ఆటగాడైన పృథ్వీ షా కూడా సిరీస్‌కు ఎంపికయ్యాడు.

భారత్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు

నెల రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టు భార‌త్‌కు చేరుకుంది. వెస్టిండీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, ఐదు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచుల్లో త‌ల‌ప‌డ‌నుంది. టీమిండియాతో తొలి టెస్టు అక్టోబ‌ర్ 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో, రెండో టెస్ట్ 12 నుంచి 16 వరకు హైద‌రాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జ‌రుగుతాయి. వ‌న్డే సిరీస్ అక్టోబ‌ర్ 20 నుంచి ప్రారంభం కానుంది.

భారత జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌.

వెస్టిండీస్‌ జట్టు: జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), సునీల్ అంబ్రిస్‌, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్‌, రాస్టన్‌ ఛేజ్‌, షేన్‌ డౌరిచ్‌, గాబ్రియల్‌, హమిల్టన్‌, షాయ్‌ హోప్‌, హెట్‌మ్యార్‌, జోసెఫ్‌, కీమో పాల్‌, కీరన్‌ పొవెల్‌, రోచ్‌, వర్రికన్‌.

వెస్టిండీస్‌ vs భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు:

మ్యాచ్ తేదీ వేదిక
మొదటి టెస్ట్ అక్టోబర్ 4 - 8 రాజ్‌కోట్‌
రెండవ టెస్ట్ అక్టోబర్ 12 - 16 హైదరాబాద్
మొదటి వన్డే అక్టోబర్ 21 గౌహతి
రెండవ వన్డే అక్టోబర్ 24 ఇండోర్
మూడవ వన్డే అక్టోబర్ 27 పూణే
నాల్గవ వన్డే అక్టోబర్ 29 ముంబాయి
ఐదో వన్డే నవంబర్ 1 తిరువనంతపురం
మొదటి టీ20 నవంబర్ 4 కోల్‌కతా
రెండవ టీ20 నవంబర్ 6 కాన్పూర్-లక్నో
మూడవ టీ20 నవంబర్ 11 చెన్నై

 

Trending News