సచిన్ తరువాత ఆ ఘనత కోహ్లీదే..

వన్డేల్లో సచిన్ తరువాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లి ఘనత సాధించాడు.

Last Updated : Feb 17, 2018, 11:49 AM IST
సచిన్ తరువాత ఆ ఘనత కోహ్లీదే..

వన్డే సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి ఆరవ వన్డేలో విరాట్ కోహ్లి సౌతాఫ్రికాపై విజృంభించాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో శతకం బాది మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో విరాట్ కు ఇది 35వ శతకం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా సచిన్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ సచిన్ తరువాత రెండో స్థానంలో నిలిచాడు.

అలాగే  కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్‌ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్‌(13), కోహ్లి(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక కెప్టెన్ గా అత్యదిక వన్డే సెంచరీలు సాధించిన భారత్ కెప్టెన్ గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.

Trending News