కుర్రాళ్లూ.. మేము గర్వపడేలా ఆడండి..!

Last Updated : Oct 3, 2017, 01:38 PM IST
కుర్రాళ్లూ.. మేము గర్వపడేలా ఆడండి..!

ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ ఈ నెల 6వ తేది నుండి భారత్‌లో ప్రారంభమవుతున్న విషయం విదితమే. తొలిసారిగా అండర్ 17 విభాగంలో ఫుట్‌బాల్  ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత్, ఒక ఆతిథ్య దేశ హోదాలో ఒక టీమ్‌గా కూడా పోటీలో పాల్గొంటోంది. ఈ పోటీలో భాగంగా తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడబోతోంది మన భారత జట్టు. ఈ సందర్బంగా భారత జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, కోహ్లీ ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. "గుడ్ లక్ బాయ్స్.. మమ్మల్ని గర్వపడేలా చేయండి" అన్నది దాని సారాంశం. భారత ఫుట్ బాల్ జట్టు.. ఈ ట్వీట్‌కు ప్రతి ట్వీట్ చేస్తూ ధన్యవాదాలు కూడా చెప్పింది. ఈ వరల్డ్ కప్‌కు సంబంధించి తొలి మ్యాచ్ న్యూఢిల్లీలోని జేఎల్‌ఎన్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవీ ముంబయి, గోవా, గౌహతి, కోచి ప్రాంతాల్లో కూడా మ్యాచ్‌లు జరుగుతాయి. ఆఖరి మ్యాచ్ మాత్రం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతుంది. 

 

Trending News